బెంగ‌ళూరులో రెండుగా చీలిన తెలుగు సంఘాలు..!

క‌ర్ణాట‌క ఎన్నిక‌లపై ఆంధ్రాలో కూడా కొంత ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఎందుకంటే, అక్క‌డ దాదాపు న‌ల‌భై నియోజ‌క వ‌ర్గాల్లో తెలుగువారి సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంది. అయితే, ఈసారి వీరంతా భాజ‌పాకి ఓట్లు వెయ్య‌డం అనుమానంగానే క‌నిపిస్తోంది. ఎందుకంటే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో భాజ‌పా అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ఇత‌ర రాష్ట్రాల్లో స్థిర‌ప‌డ్డ తెలుగువారు కూడా కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. అంతేకాదు, భాజ‌పాకి ఓటెయ్యొద్దంటూ ఇప్ప‌టికే అక్క‌డి తెలుగు ప్ర‌జ‌ల‌కు టీడీపీ పిలుపునిచ్చింది. జేడీఎస్ కు మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అక్క‌డి తెలుగువారిని కోరారు.

ఈ నేప‌థ్యంలో అక్క‌డి తెలుగు సంఘాల మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డం విశేషం. బెంగ‌ళూరులోని స‌ద‌ర‌న్ హోట‌ల్లో తెలుగు సంఘాలు స‌మావేశ‌మ‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల పోరాట వేదిక పేరిట ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటైంది. అయితే, ఈ కార్య‌క్ర‌మం కూడా రాజ‌కీయ రంగు పూసుకుంది. ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి చ‌ర్చిద్దామంటూ పిలిచిన ఈ స‌మావేశాన్నీ తెలుగుదేశం పార్టీ స‌మావేశంగా మార్చారంటూ ఒక వ‌ర్గం వాద‌న‌కు దిగింది. కొంత‌మంది వైకాపా స‌భ్యులు కావాల‌నే ఈ స‌మావేశంలో గొడ‌వ‌లు సృష్టించేందుకు వ‌చ్చారంటూ మ‌రో వ‌ర్గం వాద‌న‌కు దిగింది. దీంతో అక్క‌డి తెలుగు సంఘాలు రెండుగా చీలిపోయాయి. రెండు వ‌ర్గాల మ‌ధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది.

నిజానికి, ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌న్న అంశాన్ని ఈ స‌మావేశంలో చ‌ర్చించాల‌ని భావించారు. హాలు నిండిపోయిన త‌రువాత కొంత‌మంది వ‌చ్చార‌నీ, వారికి సంఘాల్లో స‌భ్య‌త్వాలు కూడా లేవ‌ని ఒక వ‌ర్గం వారు అంటున్నారు. తామూ తెలుగువార‌మేన‌నీ ఇక్క‌డ జ‌రిగే స‌మావేశానికి వ‌స్తే త‌ప్పేంట‌ని ఇంకో వ‌ర్గం వాదించింది. ఈ గంద‌ర‌గోళం నేప‌థ్యంలో పోలీసులు క‌ల్పించుకుని, హోటల్ నుంచి అంద‌ర్నీ పంపించేశారు. విచిత్రం ఏంటంటే… క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో టీడీపీ, వైకాపాలు లేవు కదా! అలాంట‌ప్పుడు, ఆ పార్టీల పేరుతో ఈ వాగ్వాదాలేంటో మరి..? ఇది టీడీపీ కార్య‌క్ర‌మంలా ఉంద‌ని అన‌డం, వైకాపా వారు అడ్డు త‌గ‌లార‌ని అన‌డం చిత్రంగా ఉంది. ఎందుకంటే, క‌ర్ణాట‌క‌లో తెలుగువారంతా ఎవ‌రికి ఓటెయ్యాల‌న్న నిర్ణ‌యం తీసుకోవాల‌నుకున్న‌ప్పుడు… టీడీపీ, వైకాపాల ప్ర‌స్థావ‌నే అన‌వ‌స‌రం క‌దా! స‌రే.. ఒక‌వేళ ఈ పార్టీలే అక్క‌డా ప్ర‌ాతిప‌దిక అనుకున్నా… ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ, వైకాపాలు పోరాటం చేస్తున్నాయి. అంటే, రెండూ కేంద్రంలోని భాజ‌పాకి వ్య‌తిరేకంగా ఉన్న‌ట్టే క‌దా! అలాంట‌ప్పుడు మరో అభిప్రాయానికి ఆస్కారం ఎక్క‌డుంది..? ఈ సంఘాలు రెండుగా చీలాల్సిన అవసరం ఏముంది..? ఈ మాత్రం చోటిస్తే చాలు… అక్కడ కూడా భాజపా అల్లుకుపోగలదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close