టీఆర్ఎస్‌లో హిందూత్వ ఫేస్‌గా కవిత..!

తెలంగాణ రాష్ట్ర సమితి వారసుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న కల్వకుంట్ల కవిత ఇప్పుడిప్పుడు రాజకీయాన్ని కొద్ది కొద్దిగా మారుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభావమో.. ప్రజల్లో పెరుగుతున్న హిందూత్వ భావనను రాజకీయంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనో కానీ.. ఆమె.. ఇటీవలి కాలంలో పక్కా హిందూత్వ వాదాన్ని వినిపించడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీది జై శ్రీరాం నినాదం అయితే… కవిత జైశ్రీరాంతో పాటు జైహనుమాన్ నినాదం కూడా వినిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో కొండగట్టు ఆంజనేయుడ్ని కవిత వరుసగా దర్శించుకుంటున్నారు. తాజాగా కొండ గట్టు వెళ్లి జైశ్రీరాం, జైహనుమాన్ అంటూ నినాదాలు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

నినాదాలతోనే కవిత సరిపెట్టుకోవడం లేదు. ప్రత్యేక కార్యకర్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. కొండగట్టులోనే రామకోటి స్థూపనికి భూమి పూజచేశారు. మార్చి 17-జూన్ 4 వరకు హనుమాన్ పారాయణం నిర్వహించాలని పిలుపునిచ్చారు. కవిత పర్యటనల్లో రాజకీయం లేదు..భక్తి మాత్రమే ఉందని అనుకోవడానికిలేదు. ఆమె పర్యటనల్లో పూర్తిగా రాజకీయమే కనిపిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంట వస్తున్నారు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడుతున్నారు. ఒక్క కొండ గట్టు మాత్రమే కాదు.. ఇటీవలి కాలంలో ఆలయాలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమానికి పిలుపులు వచ్చినా వెళ్తున్నారు.

కొద్ది రోజుల కిందట.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గంలోని నవీపేట్‌ మండలం జాన్నేపల్లిలో పురాతన శివాలయం పునః ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో కవిత పాల్గొన్నారు. అది ఆషామాషీగా కాదు. కొన్ని వందల కార్ల కాన్వాయ్‌తో టీఆర్ఎస్ శ్రేణులు గొప్ప ర్యాలీతో నిర్వహించారు. అదేదో రాజకీయ కార్యక్రమం అన్నట్లుగా సాగింది. ఆ శివాలయాన్ని మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన ట్రస్ట్ పేరుతో రూ. కోటి వరకూ ఖర్చు చేసి అభివృద్ధి చేశారు.హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వరకు భారీగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే ఎంతో అట్టహాసంగా.. ఆర్భాటంగా ఈ కార్యక్రమం జరిగింది.,

మొత్తంగా కవిత.. టీఆర్ఎస్‌లో హిందూత్వ ఫేస్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చంటున్నారు. యాగాలు, యజ్ఞాలతో కేసీఆర్‌కు హిందూ సమాజంలో మంచి పేరు ఉంది. అయితే ఆయన మజ్లిస్‌ను దగ్గరగా తీసుకోవడం.. బీజేపీ నేతలకు అడ్వాంటేజ్‌గా మారింది. ఈ కారణంగా భిన్నమైన వ్యూహంలో భాగంగా కవితకు టీఆర్ఎస్‌లో హిందూత్వ టాస్క్ ఇచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close