కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ మాట చెప్పి వెళదామని .. ఫాంహౌస్ కు వెళ్లారు. కానీ కేసీఆర్ కన్నెర్ర చేసి తిట్లందుకోవడంతో ఆయన మధ్యలోనే వచ్చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

తనకు ఉన్న ఇబ్బందులు చెప్పి పార్టీ మారుతున్నానని కేసీఆర్ కు చెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీ అధినేత అసహనానికి గురైనట్లుగా తెలుస్తోంది. పదేళ్ల పాటు పార్టీలో పెద్ద పీట వేసి పదవులు ఇస్తే.. కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకులు చెప్పవద్దని మండిపడినట్లుగా తెలుస్తోంది. దీంతో కేకే ఆ మాటల్ని పడలేక మధ్యలోనే వెళ్లిపోయారు.

కేకే తన రాజకీయ జీవితంలో ఎప్పుడో 1978లో ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి గెలవడం కాదు కదా కనీసం పోటీ చేయలేదు. అయినా రాజకీయాల్లో ఉంటూ ఏదో ఓ పదవి దక్కించుకుటూనే వస్తున్నారు. కాంగ్రెస్ లో ఉండే.. హైకమాండ్ ను కాకాపట్టి పదవులు పొందే సంప్రదాయాన్ని ఆయన బాగా వంట బట్టించుకోవడంతో.. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ ఆయన తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని బీఆర్ఎస్ లో చేరిపోయారు. కుమారుడ్ని, కుమార్తెను బీఆర్ఎస్‌లో చేర్పించారు. కుమారుడికి కొన్ని కాంట్రాక్టులు.. ఆర్థిక ప్రయోజనాలు.. కుమార్తెకు హైదరాబాద్ మేయర్ పదవి ఇప్పించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం పోగానే ఆయన కాంగ్రెస్ వైపు పోతున్నారు.

ఈ క్రమంలో ఆయన యూట్యూబ్ మీడియాలకు ఇంటర్యూలు ఇస్తూ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని చెబుతున్నారు. గురువారం ఆయన తాను పార్టీ మారుతున్నట్లుగా కేసీఆర్‌కు చెప్పేందుకు ఫామ్ హౌస్‌కు వెళ్లారు. కాంగ్రెస్ తనకు తక్కువ చేయలేదని, ఆది నుంచి మర్యాదలు చేసిందని ఎంపి కెకె తెలిపారు. తెలంగాణ కోసం అప్పుడు పార్టీ మారానని వివరణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నామని, నెరవేరిందని, సొంత పార్టీ వైపు చూస్తే తప్పేంటని వాదిస్తున్నారు. కేకే ఎలాగైనా తన వాదన వినిపించగలరని కాంగ్రెస్ లోనే సెటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close