కేరళలో మంత్రుల తొలగింపు కళంకమే

కేరళలో పినరాయి విజయన్‌ నాయకత్వంలోసి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం నుంచి కొద్ది మాసాలలోనే ఇద్దరు మంత్రులు తప్పులు చేసి తప్పుకోవలసి రావడం రాజకీయ కళంకమే. మొదట సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు మంత్రి జయరాజన్‌ ఆశ్రితపక్షపాతం ఆరోపణల నేపథ్యంలో దిగిపోయారు. ప్రభుత్వ సంస్థలలో తన బంధువులకు సంబంధించిన వారిని సిఫార్సు చేసినట్టు ఆయనపై ఆరోపణ వచ్చింది. నియామకం నిజమని తేలిన వెంటనే విజయన్‌ జయరాజన్‌ను తొలగించాలనే నిర్ణయించారు. ఆ సంగతి అంటుండగానే ఇప్పుడు మరో మంత్రి శశీంద్రన్‌ అసభ్య సంభాషణం టేపులో దొరికి దిగిపోవలసి వచ్చింది. శశీంద్రన్‌ ఎన్‌సిపికి చెందిన వారే గాని కమ్యూనిస్టు కాదు. అయినామంత్రివర్గ సభ్యుడు గనక ఆయన నిష్మ్రమనను రెండవదిగా చూడవలసి వుంటుంది.ఇలాటి పరిణామం గతంలో 30 ఏళ్లకు పైబడి సిపిఎం వామపక్షాలు పాలించిన పశ్చిమ బెంగాల్‌లో గాని, ఒకరు విడిచి ఒకరు అన్నట్టుగా యుడిఎప్‌ ఎల్‌డిఎప్‌ పాలించే కేరళలో గాని గతంలో ఎన్నడూ ఎదురు కాలేదు. దేశంలో కమ్యూనిస్టుల బలం తగ్గుముఖం పడుతున్న పరిస్థితిలో పాలించే ఒకే పెద్ద రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఇలాటి చేదు అనుభవాలు రావడం పట్ల సిపిఎం నేతలు ఆందోళన చెందుతున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ఎంతో మంచిపేరు తెచ్చుకోగా ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందని పరిశీలన జరుపుతూ ప్రమాణాలు పాటించాలని హితవు చెబుతున్నారట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close