కోట్ల మాటలకు అర్థాలే వేరులే!

కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఒకప్పట్లో ఈ రాష్ట్రానికే పెద్దదిక్కుగా ఉన్న ‘పెద్దాయన’ కోట్ల విజయభాస్కరరెడ్డి కుటుంబానికి వారసుడు అయిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో తరతరాల తమ కుటుంబం అనుబంధాన్ని వదలుకోనున్నారా? కాంగ్రెస్‌ పార్టీని వీడి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి డిసైడ్‌ అయ్యారా? అసలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా శవాసనం వేసి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఒకప్పట్లో ఆ పార్టీకి ఎంతో బలమైన జిల్లాగా ఉన్న కర్నూలులో ఇక పూర్తి పతనానికి చేరువలో ఉన్నదా? తాజా పరిణామాలను తరచి చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే కనిపిస్తోంది. రాహుల్‌సభలో వేదికమీదకు ‘సాక్షాత్తూ కేంద్ర మాజీ మంత్రి’ అయిన తనను అనుమతించకపోవడాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి.. ఆ అలకను ఇప్పటిదాకా వీడకుండా మరిన్ని ఊహాగానాలకు ఆస్కారం కల్పిస్తున్నారు.

నిజానికి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలుగుదేశంలో చేరబోతున్నారని, తెదేపానుంచి వారికి ఆఫరు కూడా భారీగానే దక్కిందని సుమారు ఏడాదికి పైగా ప్రచారం జరుగుతోంది. కోట్ల కుమారుడు వెళ్లి నారా లోకేశ్‌తో భేటీ అయ్యాడని.. 2019 ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వారసుడికే కర్నూలు ఎంపీ టిక్కెట్‌ ఇవ్వడానికి అంగీకరించారని, అందుకు కేఈ కుటుంబాన్ని కూడా ఒప్పించారని.. తద్వారా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని బలమైన శక్తిగా రూపుదిద్దడానికి ప్రణాళిక సిద్ధమైందని ప్రచారం జరుగుతూ వచ్చింది.

అయితే క్రమంగా ఆ ప్రచారం చప్పబడిపోయింది. తాజాగా రాహుల్‌గాంధీ కార్యక్రమానికి వెళ్లిన వారిలో సూర్యప్రకాశ్‌రెడ్డిని వేదిక మీదికి అనుమతించకపోవడం.. దానిపై ఆయన సహజంగానే తీవ్రస్థాయిలో అలిగి.. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయడం జరిగింది. అయితే రఘువీరారెడ్డి వైపునుంచి అలాంటి స్పందన మాత్రం లేదు. భవిష్య కార్యాచరణ నిర్ణయించుకోవడానికి తన అనుచరులు, కార్యకర్తలతో కోట్ల సమావేశం పెట్టుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఏ నాయకుడు అయినా సరే.. ‘కార్యకర్తల్తో సమావేశం’ అంటే పార్టీ మారుత్నుట్లే లెక్క. అయితే ఆ సమావేశం ఇంకా జరగలేదు. కాకపోతే.. ఆయన అనుచరులంతా ఇప్పుడు పెద్దస్థాయిలో.. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తూర్పారపడుతున్నారు. తమను పట్టించుకోని పార్టీలో తమ నాయకుడు ఎందుకు ఉండాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

కోట్ల సూర్యప్రకాశరెడ్డి మీడియాతో తనకు పార్టీ మారే ఉద్దేశమే లేదని ప్రస్తుతానికి చెబుతున్నప్పటికీ.. మరి కొన్ని రోజుల్లో ఆయన ఖచ్చితంగా తెదేపా తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జిల్లాలో ముమ్మరంగా జరుగుతోంది. మొత్తానికి రాజకీయాల్లోనే ‘నేతల మాటలకు అర్థాలే వేరులే’ అనే సిద్ధాంతం ఇప్పుడు కోట్లకు కూడా వర్తిస్తుందని అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close