కృష్ణుడికి, అర్జునుడికి సంబంధమే లేదు!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని డబుల్ రోల్ చేస్తున్నాడు. ఓ క్యారెక్టర్ పేరు కృష్ణ, మరో క్యారెక్టర్ పేరు అర్జున్. అయితే… సినిమాలో ఇద్దరికీ అసలు సంబంధమే ఉండదని నాని చెబుతున్నాడు. సాధారణంగా డబుల్ యాక్షన్ సినిమాలు అనగానే హీరో క్యారెక్టర్స్ రెండిటినీ అన్నదమ్ములు గానో… కవలలు గానో… తండ్రీకొడులు గానో… ఏదో ఒక రిలేషన్‌తో చూపిస్తారు. ‘కృష్ణార్జున యుద్ధం’లో అటువంటివి ఏవీ లేవని నాని క్లారిటీ ఇచ్చారు. తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ గురించి చెప్పారు. “ఏమాత్రం సంబంధం లేని కృష్ణ, అర్జున్ అనే ఇద్దరు వ్యక్తుల కథే సినిమా. ఇద్దరూ ఒకే పోలికలతో ఉండడం అనేది యాదృచ్ఛికమే. చిత్తూరులో పెరిగిన మాస్‌ కుర్రాడు కృష్ణ. ప్రాగ్‌లో రాక్‌స్టార్‌ అర్జున్‌. వీరిద్దరి వ్యక్తిత్వాలు, ఆలోచనా విధానాలు వేర్వేరు. కానీ, ఓ లక్ష్యం కోసం ఒక్కటవుతారు. అదేంటి? అనేది కథ” అని నాని పేర్కొన్నారు. అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్ నిన్న విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.