కృతికి చెబితే.. వాళ్ల‌మ్మ నేర్చుకుంది!

తెలుగులో హీరోయిన్ల కొర‌త బీభ‌త్సంగా ఉంది. అందుకే.. మ‌న‌వాళ్ల ప‌క్క చూపులు చూస్తుంటారు. ప‌క్క రాష్ట్రం నుంచి అమ్మాయిల్ని దిగుమ‌తి చేసి, హీరోయిన్లుగా మారుస్తారు. కాక‌పోతే.. వాళ్ల‌తో ఒక‌టే స‌మ‌స్య‌. భాష రాదు. తెలుగు నేర్పించ‌డానికి ప్ర‌త్యేకంగా ఓ మాస్టారుని నియ‌మించాలి. అయినా స‌రే… `నాకు కొంషెం.. కొంషెం వ‌ష్షు..` అంటూ వ‌చ్చీరాని భాషే మాట్లాడ‌తారు. `ఉప్పెన‌` కోసం కృతి శెట్టిని బెంగ‌ళూరు నుంచి తీసుకొచ్చారు. త‌న‌కీ ఇలానే తెలుగు నేర్పారు. ఆ అమ్మాయి కూడా కొంచెం క‌ష్ట‌ప‌డి తెలుగు నేర్చుకుంది. అయితే… త‌న‌కంటే ముందు కృతి శెట్టి అమ్మ‌కే తెలుగు వ‌చ్చేసింద‌ట‌. కృతి.. సెట్లో డైలాగులు చెప్ప‌డానికి ఇబ్బంది ప‌డుతుంటే.. కృతి అమ్మ మాత్రం సెట్లో తెలుగే మాట్లాడేద‌ట‌. ఓరోజు.. కృతి సెట్లో డైలాగులు మ‌ర్చిపోతే… “పోనీ నన్ను చెప్ప‌మంటారా“ అంటూ తెలుగులో ఆ డైలాగుల్ని అన‌ర్గ‌ళంగా వ‌ల్లించేసింద‌ట‌. దాంతో.. సెట్లో ఉన్న‌వాళ్లంతా షాక్ తిన్నారు. కృతికి నేర్పుదామంటే… వాళ్ల‌మ్మ నేర్చేసుకుందేంటి? అని ముక్కున వేలేసుకున్నారు. ఈ విష‌యాన్ని `ఉప్పెన‌` ద‌ర్శ‌కుడు బుచ్చి బాబునే చెప్పుకొచ్చాడు. హీరోయిన్ల చుట్టూ వాళ్ల మ‌మ్మీలు… సెట్లో తిరిగేస్తుంటారు. `బేబీ.. జ్యూసు` అంటూ ప్ర‌తి నిమిషం… బాబోగులు చూస్తుంటారు. త‌ప్ప‌.. ఇలా భాష‌లు నేర్చేసుకున్న‌వాళ్లెవ‌రూ లేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close