వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి నుంచి కేటీఆర్ పోటీ!

2019 ఎన్నిక‌ల కోసం తెరాస ఇప్ప‌ట్నుంచే ఒక్కో అడుగూ వ్యూహాత్మ‌కంగా వేస్తోంద‌ని చెప్పాలి. తెరాస కాస్త వీక్ గా ఉన్న ప్రాంతాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతోంది. టి.ఆర్‌.ఎస్‌. కాస్త బ‌ల‌హీనంగా ఉన్న ద‌క్షిణ తెలంగాణ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ముందుకు వెళ్తోంది. దీన్లో భాగంగా గ్రేట‌ర్ ప‌రిధిలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల బాధ్య‌త‌ల్ని మంత్రి కేటీఆర్ కు అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్న‌ట్టుగా పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. ఎందుకంటే, గ్రేట‌ర్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల్ని గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. దీంతో అనూహ్యంగా 99 స్థానాల‌ను తెరాస ద‌క్కించుకుంది. ఇదే ఊపును అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొన‌సాగించేందుకు కేటీఆర్ సిద్ధ‌మౌతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌యోగాత్మ‌కంగా హైద‌రాబాద్ ప‌రిధిలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి కేటీఆర్ ను పోటీలోకి దించితే బాగుంటుద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది!

గ్రేట‌ర్ ప‌రిధిలోని కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క వ‌ర్గం నుంచి కేటీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఉందంటున్నారు. నిజానికి, కూక‌ట్ ప‌ల్లిలో సెటిల‌ర్లు సంఖ్య ఎక్కువ‌. ఉమ్మ‌డి రాష్ట్రం ఉన్న‌ప్ప‌టి నుంచీ తెలుగుదేశం ప్ర‌భావమే అక్క‌డ ఎక్కువ‌గా ఉంటూ వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ అభ్య‌ర్థే గెలిచారు. టీడీపీ టిక్కెట్ పై గెలిచిన మాధ‌వ‌రం కృష్ణారావు.. త‌రువాత తెరాస‌లోకి ఫిరాయించారు. స్థానికంగా ఆయ‌న‌కి మంచి పేరే ఉంది. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటార‌నే ఇమేజ్ ఉంది. అయితే, ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ప‌నితీరుపై కేసీఆర్ కాస్త అసంతృప్తిగా ఉన్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ వెలువ‌రించిన గ‌త రెండు స‌ర్వేల్లోనూ ఎమ్మెల్యేలంద‌రిలోనూ చివ‌రి స్థానంలో కృష్ణారావు నిల‌వ‌డం విశేషం!

సో… స‌ర్వే ఫ‌లితాలు ఇలా వ‌స్తున్నాయి కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కి తెరాస సీటు ఇవ్వ‌డం అనుమాన‌మే అని తెరాస వ‌ర్గాలే అంటున్నాయి. అయితే, ఆయ‌న ర్యాంకు అనూహ్యంగా ప‌డిపోవ‌డం వెన‌క వ్యూహం ఇదే అని కూడా కొంత‌మంది విశ్లేషిస్తున్నారు. విద్యాధిక వ‌ర్గాల్లో కేటీఆర్ కు మంచి ఇమేజే ఉంది. సెటిర్ల‌తో కూడా ఆయ‌న బాగానే మెలుగుతున్నారు. సో.. కూక‌ట్ ప‌ల్లి నుంచి ఆయ‌న్ని బ‌రిలోకి దించితే.. ఆ చుట్టుప‌క్క‌ల మ‌రికొన్ని నియోజ‌క వ‌ర్గాల‌పై కూడా కేటీఆర్ ప్ర‌భావం ఉంటుంది. ఇదే సీఎం కేసీఆర్ వ్యూహం అని చెబుతున్నారు. కూక‌ట్ ప‌ల్లిలో కేటీఆర్ కు లైన్ క్లియ‌ర్ చేయ‌డం కోసమే కృష్ణారావు ర్యాంకును ఉద్దేశపూర్వ‌కంగా పడేస్తున్నార‌న్న విమర్శ‌లు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. ఏదేమైనా, కూక‌ట్ ప‌ల్లి నుంచి కేటీఆర్ పోటీకి దిగ‌డం నిజ‌మే అయితే.. అది ఆస‌క్తికరంగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close