మిగిలిన వాళ్ళంతా తప్పు చేసినట్లేనా ?

అమరావతి భూదందా లో అడ్డగోలుగా దోచేసుకున్నారంటూ… సాక్షి దినపత్రిక తెలుగుదేశం నాయకుల మీద కొన్ని రోజులుగా కథనాలు వెలువరిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కారులోని మంత్రులు బినామీల పేరిట భూమి కొనుగోళ్లకు పాల్పడి రైతులను మోసం చేశారంటూ కథనాలు వచ్చాయి. దీనిమీద చంద్రబాబు మండి పడడమూ, సాక్షి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం..అని రెచ్చిపోవడము కూడా జరిగింది. అంతా బాగానే ఉంది..కానీ సాక్షి మీద న్యాయపరంగా ప్రొసీడ్ కావడంలో కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే స్పందించారు. చంద్రబాబు ప్రకటించిన దూకుడు గమనిస్తే.. సాక్షిలో పేర్లు పడిన వాళ్ళంతా కేసులు పెట్టేస్తారేమో అనిపించింది కానీ, ఇప్పటికీ ఇద్దరు మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే సాక్షికి లీగల్ నోటీసులు ఇచ్చారు.

అయితే వీరు ఇచ్చిన నోటీసుల వల్ల కొన్ని కీలకమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. తెలుగుదేశం వారందరి మీద ఆరోపణలు వచ్చినపుడు వీరు మాత్రమే నోటీసులు ఇవ్వడం అంటే.. మిగిలిన వాళ్ళందరూ తప్పు ఒప్పుకుంటున్నట్లేనా? అనే చర్చ రాజకీయంగా నడుస్తున్నది. నిజానికి సాక్షి ఆరోపణల తరవాత ఎంపీ మురళీమోహన్, పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు ఇచ్చిన వివరణలు కాస్త కన్విన్సింగ్ గా అనిపించింది. అయితే వాళ్ళు ఎవరూ ఇప్పుడు పెద్ద స్పందించినట్లు లేదు. లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అనేకమంది మీద సాక్షి కథానాల్లో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వీరిద్దరూ మాత్రమే నోటీసులు ఇవ్వడం అంటే.. మిగిలిన వాళ్ళంతా కూడా.. తప్పు చేసారని అర్ధం వస్తుందా..అని పలువురు అనుకుంటున్నారు.

ఇక్కడ మరొక సమస్య కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు నారాయణ కాలేజి ఉద్యోగి, మంత్రి నారాయణ బంధువు అయిన ఒక వ్యక్తి భూములు కొనడానికి సంబంధించి వార్తల్లో ఉన్నది. ఇప్పుడు నారాయణ లీగల్ నోటీసులు ఇచ్చిన సరే.. కేసు విచారణకు వస్తే.. సదరు ఉద్యోగి కూడా న్యాయ పీఠం ముందుకు రావలసి ఉంటుంది. తమకు అంత భారీ మొత్తంలో సొమ్ము ఎలా వచ్చిందో.. అది అంతా వైట్ మనీ అవునో కాదో… ఆ సొమ్ముకు తాము పన్నులు చెల్లిస్తూ వచ్చామో లేదో.. కోర్టుకు చెప్పుకుని న్యాయం, చట్ట పరంగా తాము మంత్రికి బినామీ కాదని నిరూపించుకోవాలి. అది చాలా కష్టమైనా విషయం. అంటే ఈ ఉదాహరణలోని విషయం బినామీలు అందరికి వర్తిస్తుంది. వీరు కేసులు వేయడం అంటే.. ఒకరకంగా న్యాయ విచారణ ప్రక్రియ మొదలు అయిపోయినట్లే అవుతుందని. సాక్షి గనుక ఈ కాస్త ఆధారాలు చూపించినా సరే, మంత్రులు, టీడీపీ నాయకులు, ప్రధానంగా వారి బినామీ లు ఇరుక్కుపోయారని పలువురు అనుకున్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close