రుణమాఫీ : రైతులకు బాబు, జగన్ ద్రోహం..!

ఆంధ్రప్రదేశ్‌ రైతులు రాజకీయ చదరంగంలో మరోసారి దారుణంగా మోసపోయారు.  ఒకాయన రుణమాఫీ చేస్తానన్నారు. పదవి చేపట్టారు. డబ్బుల్లేవ్. ఐదేళ్లలో చేస్తానన్నారు. ఐదేళ్లకు ఐదు కిస్తీలు వేసి.. రెండు కిస్తీలు ఎగ్గొట్టారు. ఎన్నికలకు ముందు జీవోలిచ్చారు. ఓడిపోయారు. కొత్తగా వచ్చిన సీఎం ఆ కిస్తీలతో మా ప్రభుత్వానికేమీ సంబంధం లేదు. ఇవ్వనే ఇవ్వబోమంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన బాండ్లు, రుణవిమోచనపత్రాలు చెల్లవంటున్నారు… ఇద్దరూ ఇద్దరే..! ఆ ఇద్దరు ఎవరో .. అందరికీ తెలుసు..!

గెలుపు ఇచ్చిన రైతుల్ని మోసం చేసిన చంద్రబాబు..!

రుణమాఫీ అనే హామీని గెలుపు చుక్కానిగా చేసుకుని.. 2014లో అధికారం దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు… ఆ హామీని అమలు చేసి.. రైతుల మోముల్లో.. చిరునవ్వు నింపుదామని ప్రయత్నం చేయలేదు.  రూ. లక్షన్నర పరిమితి పెట్టి.. రూ. 24వేల కోట్లు తీరుస్తామని చెప్పి… ప్రజలను ఒప్పించగలిగారు. కానీ.. ఆ మొత్తం అయిన తన పదవీ కాలంలో చెల్లించేస్తే.. గెలుపు ఇచ్చిన హామీకి న్యాయం.. నమ్మిన రైతులకు భరోసా కల్పించిన వారయ్యేవారు. కానీ మూడు కిస్తీలు కట్టి.. రెండు కిస్తీలకు జీవో జారీ చేసి.. సరిపెట్టారు. నిజానికి చంద్రబాబుకు రైతుల్ని మోసం చేయాలన్న ఉద్దేశం మాత్రమే ఉంది. నిధులున్నప్పటికీ.. ఆ నిధులు మంజూరు చేయకపోతే ఏమవుతుందిలే.. అన్నట్లుగా రాజకీయం చేశారు. కొత్త పథకాలకు నిధుల వెల్లువ పారించడమే దానికి సాక్ష్యం. 

కొత్త పథకాలకు నిధుల వరద…! రుణమాఫీ కిస్తీలకు ఎందుకివ్వలేదు..? 

ఎన్నికలకు ముందు రైతులకు రెండు వాయిదాల కిస్తీలు ఎడెనిమిది వేల కోట్లు అవసరం. దానికి తగ్గ డబ్బు ప్రభుత్వం వద్ద ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం… ఆ డబ్బును.. ఇతర కొత్త పథకాలకు మళ్లించింది. అన్నదాత సుఖీభవ, మహిళలకు పసుపు-కుంకుమల పేరుతో.. ఇతర పథకాలకు మళ్లించారు. దాని వల్ల వచ్చిన లాభమేంటి..? అలా డబ్బులిచ్చిన వారు ఎన్నికలకు ముందు ఇస్తున్నారని.. అనుకున్నారు. ఐదేళ్లయినా తమకు రుణమాఫీ చేయలేదని.. రైతులు అనుకున్నారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా… చంద్రబాబు పరిస్థితి అయింది. అన్నింటి  కంటే మించి… రైతులకు బాకీ పడ్డారనే అభిప్రాయం బలపడిపోతుంది. ఇప్పుడు.. ఆ రెండు కిస్తీలకు బాధ్యులెవరు..? ఆ ప్రభుత్వం అధికారంలో లేదు..ఈ ప్రభుత్వం ఇవ్వదు..! రైతులకు జరిగే నష్టానికి.. బాధ్యులెవరు..?. చంద్రబాబు చేసిన మోసమే.. రైతుల్ని ఇబ్బందులకు గురి చేసిందనడంలో మరో ఆలోచన కూడా ఉండక్కర్లేదు. 

జగన్‌కు కావాల్సింది రాజకీయమేనా..? రైతు సంక్షేమం కాదా..?

ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు కంటే ఘోరంగా… రైతులను రాజకీయానికి వాడుకుంటోంది. రుణమాఫీ గత ప్రభుత్వం చేయకపోతే.. తాము చేసి.. రైతుల్ని ఆదుకోవాలి. రైతులపై అభిమానం ఉన్న అ నేత అయినా అదే చేస్తారు. ఎందకంటే.. ఆ రుణమాఫీ ప్రాసెస్ మధ్యలో ఉంది. బడ్జెటరీ ప్రాసెస్ కూడా పూర్తయింది.  ప్రభుత్వం అధికారం చేపట్టే సరికి.. మంజూరు  సంతకం చేస్తే సరిపోయేది. కానీ ఆ నిధులు ఇతర అవసరాలకు… ఉపయోగించుకునే ఉద్దేశంతో.. అది పాత ప్రభుత్వ పథకం అని చెప్పి.. .పక్కన పెట్టేశారు. చంద్రబాబు రుణమాఫీ చేయలేదని.. తనకు ఓట్లేసిన రైతులకు జగన్‌కు కోలుకోలేని దెబ్బకొట్టారు. జగన్ కు యభై శాతం ఓట్లు వచ్చాయంటేనే..అన్ని వర్గాల వారు అదరించారని అర్థం. ఇచ్చిన హమీలను.. అమలు చేయఅలాంటప్పుడు.. ఆదరించిన వారిని.. నష్టపరచాలని… అనుకోవడం ఎందుకు..? గత ప్రభుత్వం పనులను కొనసాగించడానికి ఈ ప్రభుత్వానికి అసలు బాధ్యతే లేదన్న వాదన అసమర్థతకు.. నిదర్శనం. అలా అయితే.. కేంద్రాన్ని ఇక విభజన హామీల గురించి అడగాల్సిన హక్కును కోల్పోయినట్లే. 

రైతు బాగుంటునే రాష్ట్రం బాగుటుందని తెలుసుకోలేని రాజకీయం..! 

ఎలా చూసినా.. రాజకీయానికి రైతులు దగా పడ్డారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మిన రైతులు దగా పడితే.. ఇప్పటి సీఎం కేవలం రాజకీయ కోణంలోనే.. రైతుల్ని నట్టేట ముంచుతున్నట్లుగా.. వ్యవహరిస్తున్నారు. ఇద్దరికీ కావాల్సింది. .. రాజకీయమే. ఇప్పుడు రైతులకు దిక్కెవరు..? ఆత్మహత్యలే వాళ్లకు శరణ్యమా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close