ర‌జ‌నీ సినిమాకి బ‌జ్ ఇంతేనా?

ర‌జ‌నీ కాంత్ సినిమా వ‌స్తుందంటే ముందే పూన‌కాలు వ‌చ్చేస్తాయి. ఆయ‌న సినిమా గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకోవ‌డం మొద‌లెడ‌తారు. ర‌జ‌నీ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించ‌బోతోంది? దాని హ‌వా ఏ మేర‌కు ఉంటుంది? అనే విష‌యాల ప‌ట్ల ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. ఆ క‌థ‌కు సంబంధించిన విష‌యాలో, అందులో ర‌జ‌నీ చేయ‌బోతున్న విన్యాసాలో ఒక‌టో అరో బ‌య‌ట‌కు వ‌స్తాయి. కానీ.. ‘ద‌ర్బార్‌’కి సంబంధించి అలాంటి హ‌డావుడి ఏమీ క‌నిపించ‌డం లేదు. 2 రోజుల్లో ద‌ర్బార్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే.. ఈ సినిమాపై, ముఖ్యంగా తెలుగు వెర్ష‌న్ విష‌యంలో ఎలాంటి బ‌జ్ లేదు. మురుగ‌దాస్ – ర‌జ‌నీ కాంబో అంటే మామూలుగా ఉండ‌దు. ఈ కాంబో గురించి ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు. అలాంటి కాంబినేష‌న్ సెట్ అయినా స‌రే – ద‌ర్బార్ టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీ కాలేక‌పోయింది.

ద‌ర్బార్ ఆడియో ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగినా, ఈ సినిమాపై ఎలాంటి హైపూ లేదు. రోబో 2, కాలా, క‌బాలీ.. ఇలా వ‌రుస‌గా ర‌జ‌నీ సినిమాలు ఫ్లాపులు అవుతూ వ‌చ్చాయి. తెలుగులో ఏమాత్రం వాటి ప్ర‌భావం చూపించ‌లేదు. పైగా ఇది సంక్రాంతి సీజ‌న్‌. బ‌న్నీ సినిమా గురించో, మ‌హేష్ సినిమా గురించో మాట్లాడుకున్నంత‌గా ర‌జనీ సినిమా గురించి తెలుగువాళ్లు ఎందుకు మాట్లాడుకుంటారు? వాళ్లంద‌రి దృష్టీ ఆ రెండు సినిమాల‌పైనే ఉంది. ర‌జ‌నీ సోలోగా వ‌స్తే త‌ప్ప‌కుండా బ‌జ్ ఉండేది. ఇప్పుడు గుంపులో వ‌స్తున్నాడు కాబ‌ట్టి అదేం లేకుండా పోయింది. ఈ సినిమా సోసోగా ఉందంటే.. ప‌ట్టించుకునేవాడే ఉండ‌డు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close