రూమ‌ర్స్‌కి చెక్ పెట్టిన మ‌హేష్‌

బ్ర‌హ్మోత్స‌వం త‌ర‌వాత మురుగ‌దాస్ తో క‌ల‌సి ఓ సినిమా చేయ‌బోతున్నాడు మ‌హేష్ బాబు. స్ర్కిప్టు ఎప్పుడో పూర్త‌యిపోయింది. ఇక సెట్స్‌పైకి వెళ్ల‌డ‌మే త‌రువాయి. అయితే ఈ సినిమా క‌థ న్యాయ వ్య‌వ‌స్థ చుట్టూ తిరుగుతుంద‌ని, న్యాయ వ్య‌వ‌స్థ‌లోని లోపాల్ని ఎత్తి చూపే క‌థ అని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే.. అదేం కాదట‌. ఇవ‌న్నీ రూమ‌ర్లు అంటున్నాడు మ‌హేష్ బాబు. ”ఆ వార్త‌లు నేనూ విన్నా. మాసినిమాపై అప్పుడే రూమ‌ర్లు మొద‌లైపోయాయా అనుకొన్నా. ఇదేం న్యాయ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన క‌థ కాదు. మురుగుదాస్ స్టైల్‌లోనే ఉండే క‌థ‌. ఓ సోష‌ల్ ఇష్యూని క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చెబుతున్నాం” అంటున్నాడు.

ఒక్క‌డు సినిమా అంటే మురుగ‌దాస్‌కి చాలా ఇష్ట‌మ‌ట‌. గ‌జిని సినిమా చూసిన‌ప్ప‌టి నుంచీ మ‌హేష్‌.. మురుగ‌దాస్‌తో క‌ల‌సి సినిమా చేయాల‌నుకొంటున్నాడు. ఆఖ‌రికి శ్రీ‌మంతుడు స‌మ‌యంలో ఈ సినిమాని ఓకే చేశాడు మ‌హేష్‌. ”శ్రీ‌మంతుడు ప్ర‌చారం కోసం చెన్నై వెళ్లా. అక్క‌డ‌
మురుగ‌దాస్ వ‌చ్చి క‌లిశారు. అప్పుడే క‌థ వినిపించారు. విన‌గానే భ‌లే న‌చ్చేసింది” అంటూ మురిసిపోతున్నాడు మ‌హేష్‌. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. 2017 ప్ర‌ధ‌మార్థంలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close