మంచువారి అబ్బాయ్… మరో గెస్ట్ రోల్

ఆపరేషన్ గెస్ట్ రోల్స్… మంచువారి అబ్బాయ్ మనోజ్ కొత్త ప్రాజెక్ట్! స్నేహితులు అడగడం ఆలస్యం అన్నట్టు గెస్ట్ రోల్స్ చేయడానికి సిగ్నల్ ఇస్తున్నాడు. తరుణ్ ఫ్లాపుల జాబితాలో చేరిన తాజా సినిమా ‘ఇది నా లవ్ స్టోరి’లో మనోజ్ గెస్ట్ రోల్ చేశాడు. సినిమా విడుదల ముందు రోజు వరకూ ఈ సంగతిని తరుణ్ టీమ్ దాచి పెట్టింది. ప్రేక్షకులకు సడన్ స‌ర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నారు. రిలీజ్ రోజే సినిమాకు ఘోరమైన ప్లాప్ టాక్ రావడంతో మంచు మనోజ్ గెస్ట్ రోల్ గాల్లో కలిసింది. ఇది పక్కన పెడితే… మరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. శ్రీకాంత్ హీరోగా కరణం బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆపరేషన్ 2019’లో అతిథిగా చేస్తున్నాడు మనోజ్. పోసాని దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రాజకీయాల నేపథ్యంకి వచ్చిన ‘ఆపరేషన్ దుర్యోధన’ హిట్ కొట్టింది. దాన్ని గుర్తు పెట్టుకుని రాజకీయల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారు. 2019 ఎన్నికల ముందు సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మనోజ్ రోల్ ఉంటుందో? ‘ఒక్కడు మిగిలాడు’ ప్లాప్ తర్వాత మనోజ్ మరో సినిమాకి సంతకం చేయలేదు. క్రేజ్ వచ్చే సినిమాల్లో కాకుండా స్నేహం కోసం చిన్నా చితకా సినిమాల్లో వరుస పెట్టి అతిథి పాత్రలు చేసుకుంటూ వెళ్తే హీరోగా కెరీర్ చిత్ర విచిత్రమైన మలుపులు తీసుకునే ప్రమాదం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.