మైనార్టీ కుటుంబం ఆత్మహత్య చుట్టూ రాజుకున్న రాజకీయం..!

నంద్యాలలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మైనార్టీ కుటుంబం వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుందంటూ..  సీఐను సస్సెండ్ చేసి అరెస్ట్ చేశారు. హెడ్ కానిస్టేబుల్‌ను కూడా సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. కానీ వారికి బెయిల్ ఇట్టే లభించింది. ఇరవై నాలుగు గంటలు కూడా వారు అరెస్ట్ కాలేదు.  ఘటన జరిగినప్పుడు సైలెంట్‌గా ఉన్న ప్రభుత్వం… తమ ఆత్మహత్యకు పోలీసులే కారణం అంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు రాగానే.. కదిలింది. ఆ వీడియో వైరల్ కావడంతో.. రాజకీయ పార్టీలు స్పందించాయి.

 ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై  పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు.  దీంతో వైసీపీ మైనార్టీ నేతలు రంగంలోకి దిగి.. టీడీపీపై తిట్ల దండకం అందుకున్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా నంద్యాల వెళ్లి చనిపోయిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది.  అంజాద్ భాషా ఎవరికి అండ ఇస్తారో కానీ.. ఆయన మాత్రం.. మైనార్టీలపై జరుగుతున్న దాడులతో .. తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో హుటాహుటిన నంద్యాల వెళ్లారు. 

అమరావతిలో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని అడ్డుకున్న కేసులో దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన ప్రభుత్వం.. ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసులు పెట్టినట్లుగా హడావుడి చేసింది కానీ.. ఆ కేసులు ఇలా బెయిల్ పిటిషన్ పెట్టుకోగానే.. అలా వచ్చేసే కేసులుగా పెట్టింది. ఫలితంగా వారిద్దరికీ ఇరవై నాలుగు గంటలు కాక ముందే బెయిలొచ్చింది.  ప్రభుత్వం, పోలీసులు తల్చుకుంటే ఎలాంటి మాయ అయినా చేయగలదని విపక్ష పార్టీలు మండి పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close