మోదీ నుండి బండి సంజయ్‌కు “శభాష్” సర్టిఫికెట్!

పాదయాత్ర చేసి బీజేపీ గ్రాఫ్‌ను పెంచారని బండి సంజయ్‌కు ప్రధాని మోజీ ఫోన్ చేసి మరీ శభాష్ అని పొగిడారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ సభ సక్సెస్ అయిందని అభినందనలు తెలిపారు. కష్టపడి పని చేస్తున్నారంటూ బండి సంజయ్ కుమార్ ను అభినందించారని తెలంగాణ బీజేపీ ప్రకటించింది. నడిచింది నేనయినా.. నడిపించింది మీరేనని బండి సంజయ్ ప్రధానికి తెలిపారు. మోదీ చెప్పిన ” సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్‌” పాలన రాష్ట్రంలో తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నామని బండి సంజయ్ ప్రధానికి తెలిపారు.

పాదయాత్రలో ప్రజలు ఏమంటున్నారని సంజయ్ ను ప్రధాని మోదీ అడిగారు. కేసీఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ..కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్ తెరమరుగు చేసే కుట్ర చేస్తున్నారని ప్రధానికి బండి తెలిపారు. పాదయాత్రలో కేంద్రం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తుండoతో కేసీఆర్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. తెలంగాణా లోనూ మీలాంటి నీతివంతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.

ప్రధానమంత్రి ఫోన్ చేయడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందని బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వారాంతాల్లో బాగా పని చేస్తున్న పార్టీ నేతలకు ఫోన్లు చేస్తూంటారు. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినప్పుడు కూడా బండి సంజయ్‌కు ప్రధాని ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. నిన్న అమిత్ షా.. కేసీఆర్‌కు పోటీగా బండి సంజయ్ అని ప్రకటించడం.. ఇవాళ మోదీ నేరుగా ఫోన్ చేయడంతో హైకమాండ్ వద్ద మరింత పలుకుబడి పెరిగిందని బండి సంజ్ వర్గీయులు సంతృప్తిగా ఉన్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఏపీకి ఏం ఉపయోగం !?

విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని అంశానికి జూన్ రెండో తేదీన ముగింపు రాబోతోంది. మరోసారి పొడిగింపు అసాధ్యం అని తెలిసినా సరే కొంత మంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే...

డ్రగ్స్ పార్టీ కేసు వైసీపీ చుట్టే తిరుగుతోంది !

డ్రగ్స్ అంటే వైసీపీ పేరు ఖచ్చితంగా వస్తోంది. ఏదో ఆషామాషీగా మీడియాలో వచ్చే కథనాలు కాదు. నేరుగా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నవారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ 2గా నిలిచిన...

పల్లీబఠాణి కామెంట్స్‌తో రాకేష్ రెడ్డిని ముంచిన కేటీఆర్

బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close