సుభాష్ : అడ్డదారిలో టిక్కెట్టు..! శకునం చెప్పి కుడితిలో పడ్డావేంటి నాగబాబూ..!

“అంతా నా ఇష్టం” అనే కౌరవుడు సినిమాలో తాను చెప్పిన డైలాగ్‌ను తనకు తాను అన్వయించేసుకుని.. అందర్నీ ఇష్టం వచ్చినట్లు విమర్శించడం.. “అంతా నా ఇష్టం” అనుకున్నారు నాగబాబు. ఓ యూ ట్యూబ్ చానల్ పెట్టి.. అవసరం ఉన్నా లేకపోయినా.. టీడీపీ, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అందులోనూ.. టీడీపీపై మరింత ఎక్కువ. లోకేష్ అడ్డదారిలో మంత్రి అయ్యారంటూ యూ ట్యూబ్‌లో ప్రదర్శించిన స్కిట్లకు లెక్కలేదు. మరి ఇప్పుడు.. నాగబాబు ఏ దారిలో టిక్కెట్ తెచ్చుకున్నారు…?

అందరినీ విమర్శించి… తానే షార్ట్‌కట్‌ టిక్కెట్ పట్టేసిన నాగబాబు..!

జనసేన పార్టీ పెట్టి ఐదేళ్లయింది. ఈ ఐదేళ్లలో ఆ పార్టీ కోసం..ఉద్యోగాలు వదులుకున్న వారున్నారు. వాలంటీర్లుగా పని చేసేందుకు సొంత ఆదాయ మార్గాలను వదులుకున్న అభిమానలున్నారు. నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేయడానికి తిరిగిన వారున్నారు. కానీ.. అలాంటి వాళ్లకి.. టిక్కెట్లు చాలా మందికి దక్కలేదు. కానీ నాగబాబుకు మాత్రం… టిక్కెట్ వచ్చింది. అడ్డదారిలో వచ్చింది. తమ్ముడు పార్టీ అధ్యక్షుడు కాబట్టి వచ్చింది. పార్టీ కోసం కష్టపడి టిక్కెట్ తెచ్చుకోవడం.. వేరు. కేవలం పార్టీ అధ్యక్షుడి తమ్ముడిగా… ఎలాంటి రూల్స్ లేకుండా.. నేరుగా అడ్డదారిలో వచ్చి బీఫాం అందుకోవడం వేరు. పలు నియోజకవర్గాల్లో… జనసేన తరపున పని చేసిన వారికి.. అవకాశాలు దక్కలేదు. వాళ్లతో పోలిస్తే.. నాగబాబు.. షార్ట్ కట్‌లో సక్సెస్ అయినట్లే..!

పార్టీ కోసం కష్టపడిన వాళ్లు మంత్రులయితే ఎందుకు విమర్శించారు..?

నిజానికి ప్రజారాజ్యం పార్టీలో… నాగబాబు అవకాశం పొందితే ప్రశ్నించేవారు ఎవరూ ఉండేవాళ్లు కాదు. ఎందుకంటే.. ఆయన పీఆర్పీ ప్రారంభానికి ముందు ప్రి ప్రొడక్షన్ వర్క్ చాలా చేశారు. ప్రతి జిల్లాలో మామిడి తోటల్లో అభిమానులతో సమావేశాలు పెట్టారు. వారిని మానసికంగా సిద్ధం చేశారు. అప్పుడు టిక్కెట్ తీసుకుని పోటీ చేస్తే జస్టిఫికేషన్ ఉండేది. టీడీపీ తరపున నారా లోకేష్… ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం పని చేశారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సహా.. వారి సంక్షేమానికి ఓ ప్రత్యేకమైన నెట్ వర్క్ టీడీపీ దగ్గర ఉందంటే.. దానికి మాస్టర్ మైండ్ లోకేషే. ఆయన తన పనితీరును చూపించారు. మంత్రిగా వచ్చారు. ఇతర ఎమ్మెల్యేల అవకాశాలను దెబ్బతీయడం ఎందుకన్న ఉద్దేశం కావొచ్చు… ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. చంద్రబాబు ఆదేశిస్తే రాజీనామా చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. అధికార పార్టీగా గెలవడం పెద్ద విషయం కూడా కాదు. ఇప్పుడు నేరుగానే బరిలోకి నిలబడ్డారు. అదీ కూడా… ఇతర నేతలకు అన్యాయం చేసి కాదు..! దశాబ్దాలుగా గెలవని సీట్లోనే..!

ఇప్పటికీ తెలంగాణ ఓటరే..! ఏపీపై అభిమానం ఏది..?

నాగబాబు ఇప్పుడు తమ్ముడు క్రేజ్‌తో.. నర్సాపురంకు ఎంపీ అయిపోదామనుకుంటున్నారు. నిజానికి ఆయన తెలంగాణ ఓటర్. ఆయనకు ఏపీ పట్ల ఎలాంటి సానుకూల భావం లేదు. ప్రత్యేకహోదా అంశం వచ్చినప్పుడు కనీసం ఏపీ కోసం మద్దతుగా నిలబడలేదు. చివరికి ఓటు కూడా మార్పించుకునే ప్రయత్నం చేయలేదు. రాజకీయాల్లో నీతులు అనేవి ఒకరిని విమర్శించడానికే. తాము ఆచరించాల్సి వచ్చే సరికి.. తమ విషయంలో తప్పేమీ లేదన్నట్లు చెబుతూంటారు. ఇప్పుడు నాగేంద్రబాబుది కూడా అదే పరిస్థితి. ఆయన తన జీవితంలో నర్సాపురానికి ఎన్ని సార్లు వెళ్లారో… వేళ్లపై లెక్క పెట్టి ఉండవచ్చు. అది కూడా సిన్మా షూటింగులకో.. మరో వ్యాపార కోణంలోనే వెళ్లి ఉంటారు కానీ.. సామాన్య జనం కోసం… సాయం చేద్దామన్న ఉద్దేశంతో ఒక్కసారి కూడా వెళ్లి ఉండరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close