అతి జాగ్రత్తలో నాని..!

నాచురల్ స్టార్ గా స్క్రీన్ నేమ్ సంపాధించిన తర్వాత నాని మీద మరింత భాధ్యత పెరిగింది. అందుకే తను చేసే సినిమాల్లో ఎలాంటి తప్పులు జరుగకుండా చూస్తున్నాడు. కెరియర్ సాఫిగా సాగుతున్న సమయంలో అనవసర ప్రయాసలకు పోయి ఫ్లాప్స్ మూటకట్టుకున్న నాని భలే భలే మగాడివోయ్ సినిమాతో స్టార్ క్రేజ్ సంపాధించాడు. ఇక రీసెంట్ రిలీజ్ కృష్ణగాడివీర ప్రేమ గాథ కూడా మంచి హిట్ అవ్వడంతో నానితో సినిమా తీసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

నాని మాత్రం ఇదివరకు చేసిన తప్పు చేయకుండా కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడట. అందుకే ఈ మధ్య కొంతమంది దర్శకులు చెప్పిన 16 కథలకు కూడా నో చెప్పాడని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం తనకు హీరోగా మొదటి అవకాశాన్ని ఇచ్చిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నాని ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమా దర్శకుడు విరించి వర్మతో సినిమా కమిట్ అయ్యాడు. మరి ఇంత జాగ్రత్త పడుతున్న నాని కెరియర్ లోమరిన్ని భారీ విజయాలు సొంతం చేసుకుని నాచురల్ స్టార్ గా మరింత క్రేజ్ సంపాధించాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

టాలీవుడ్‌ ‘మే’ల్కొంటుందా?

2024 క్యాలెండ‌ర్‌లో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. ఈ వ్య‌వ‌ధిలో తెలుగు చిత్ర‌సీమ చూసింది అరకొర విజ‌యాలే. ఏప్రిల్ అయితే... డిజాస్ట‌ర్ల‌కు నెల‌వుగా మారింది. మే 13తో ఏపీలో ఎన్నిక‌ల హంగామా ముగుస్తుంది. ఆ...

పేరుకే పాతిక కోట్లు.. అంతా ఎగ్గొట్టేవారే!

పాపం... టాలీవుడ్ లో ఓ హీరో ప‌రిస్థితి చూస్తే జాలేస్తోంది. ఎలాంటి అండ దండ లేకుండా సినిమాల్లోకి వ‌చ్చి, స్టార్ గా ఎదిగిన హీరో అత‌ను. పారితోషికం మెల్ల‌మెల్ల‌గా పెరుగుతూ, ఇప్పుడు పాతిక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close