సినిమా మీద నాని నమ్మకం భలే భలే..!

ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ హీరో ఎంత పెద్ద స్టార్ అయినా సరే కాస్త కూస్తో టెన్షన్ పడక తప్పదు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కొద్ది వారు నిద్రకు కూడా దూరమవుతారు. అయితే నాని మాత్రం ఇందుకు విరుద్ధం అనేస్తున్నాడు. తను చేసిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని చాలా కాన్ఫిడెంట్ తో చెబుతున్నాడు.

అంతేకాదు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా తనకు చాలా ప్రశాంతంగా ఉందని ఎటువంటి టెన్షన్ లేదని అంటున్నాడు. తను ఎందుకు అంత నమ్మకంగా ఉన్నానో రిలీజ్ తర్వాత సినిమా చూసిన ఆడియెన్స్ చెబుతారంటున్నాడు నాని. భలే భలే మగాడివోయ్ సినిమాతో నాచురల్ స్టార్ గా అవతరించిన నాని ఆ క్రేజ్ ను ఈ సినిమాకు కూడా వాడుతున్నాడు.

14 రీల్స్ బ్యానర్ లో నిర్మించబడ్డ ఈ సినిమా నైజాం లో అభిషేక్ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. కేవలం ఒక్క హైదరబాద్ సిటీలోనే 70 థియెటర్స్ లో నాని తన వీర ప్రేమ గాధ చూపించబోతున్నాడు. మరి తన నమ్మకం నిజమైందా కాదా అన్నది మరో రెండు రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 14 రీల్స్ బ్యానర్ లో నిర్మించబడింది. మెహెరిన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు విశాల్ చక్రవర్తి సంగీతం అందించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close