వాటా… నానికి లాభ‌మా? న‌ష్ట‌మా?

పారితోషికం బ‌దులుగా వాటా తీసుకోవ‌డం ఈనాటి క‌థానాయ‌కుల ట్రెండ్‌. మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా వాటాకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నాని కూడా ఇప్పుడు అదే బాట‌లో న‌డుస్తున్నాడు. `జెర్సీ` సినిమాకి నాని పారితోషికం తీసుకోలేదు. వాటా మాత్ర‌మే ద‌క్కించుకున్నాడు. `జెర్సీ` సినిమా విడుద‌లై మంచి టాక్‌తో న‌డుస్తోంది. తొలి మూడు రోజుల్లోనూ దాదాపు 16 కోట్లు (షేర్‌) వ‌సూలు చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 26 కోట్ల బిజినెస్ జ‌రుపుకొంది. లాంగ్ ర‌న్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చు. శాటిలైట్‌తో క‌లుపుకుని దాదాపు 36 కోట్లు వ‌సూలు అయిన‌ట్టు. అంటే.. 18 కోట్ల లాభం. అందులో మూడొంతులు తీసుకున్నా దాదాపుగా 6 కోట్లు పారితోషికం.

నాని రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు 6 నుంచి 8 కోట్లు ఉంటోంది. అంటే.. త‌న టార్గెట్ రీచ్ అయిన‌ట్టే అనుకోవాలి. పైగా `రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా చేశాడు` అన్న మంచి పేరు కూడా మూట‌గ‌ట్టుకున్నాడు. నాని సినిమా అనేస‌రికి.. క‌నీసం 40 కోట్ల వ్యాపారం జ‌రిగిపోతోంది. అది నానికి ఉన్న క్రేజ్‌. అందుకే నాని ధైర్యంగా పారితోషికం బ‌దులుగా వాటా తీసుకోవ‌డానికి రెడీ అయ్యాడు. కొన్ని మంచి క‌థ‌లు వ‌చ్చిన‌ప్పుడు, వాటి వెనుక నిల‌బ‌డాల‌న్న త‌ప‌న పెరిగిన‌ప్పుడు క‌థానాయ‌కులు ఈ త‌ర‌హా త్యాగాలు చేస్తే బాగానే ఉంటుంది. పైగా నాని త్యాగం పూర్తి క్లాలిక్లేటెడ్‌. ఇదేం ఆర్ట్ సినిమా కాదు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి ట‌చ్ అయితే.. ఎక్క‌డో ఉంటుంద‌ని నానికి తెలుసు. అందుకే ఈ స్టెప్ తీసుకున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close