పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నారా రోహిత్‌ ‘తుంటరి’

శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘తుంట‌రి’. బాణం, సోలో, సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌. తాజాగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ లో ఆయ‌న న‌టిస్తున్న తుంటరి చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ క‌థ‌ను అందించిన సినిమా ఇది. నారా రోహిత్ ప‌క్క‌న ల‌తా హెగ్దే నాయిక‌గా న‌టిస్తోంది. గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అశోక్ బాబా, నాగార్జున్ నిర్మాత‌లు. దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ న్యూ లుక్‌తో క‌నిపిస్తారు. ఈ సినిమా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కుతున్న‌ట్టు చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరాః ఎం.ఆర్‌.ప‌ళ‌ని కుమార్‌, మ్యూజిక్ః సాయికార్తీక్‌, ఎడిట‌ర్ః త‌మ్మిరాజు, ఆర్ట్ః ముర‌ళి కొండేటి, స్టంట్స్ః వెంక‌ట్‌, కొరియోగ్ర‌ఫీః బాబా భాస్క‌ర్‌, నిర్మాత‌లుః అశోక్ బాబా, నాగార్జున్‌, ద‌ర్శ‌క‌త్వంః కుమార్ నాగేంద్ర‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఇసుక మాఫియాను గుర్తుకు తెచ్చుకోండి !

ఇసుక..ఈ మాట వింటే ఏపీ ప్రభుత్వ పెద్దల కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇసుకను తినమరిగి జీర్ణించుకోవడానికి అలవాటు పడ్డారు మరి. అధికారంలోకి వచ్చేటప్పటికి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. రాగానే ...

ఈ రోజూ ప్రచారానికి జగన్ బ్రేక్ – నిస్పృహ !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహల్లోకి చేరిపోయారు. ఆయన ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లు బయటకు రాకుండా ఉన్న ఆయనకు ఇప్పుడు నిరంతరాయంగా ప్రచారం చేయడం బద్దకంగా మారింది. ఓ...

నో వ్యాక్సిన్…ఇండియాలో వెస్ట్ నైల్ ఫీవర్ టెన్షన్..

కరోనా పీడ విరగడ అయిందని జనం రిలాక్స్ అవుతుండగా మరో కొత్త జ్వరం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో వెలుగుచూసిన ఈ కొత్తరకం జ్వరం అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్...

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close