మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కేంద్రంగా వెలుగుచూసిన కార్పొరేట్ జిహాద్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు కార్పొరేట్ రంగాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించడం, ఇతర వర్గాలను మత మార్పిళ్లకు ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో కార్పొరేట్ జిహాద్ అనే కొత్త చర్చకు తెరలేపాయి. పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా బయటపడిన ఈ ఉదంతం, కేవలం నియామకాల అవకతవకలకే పరిమితం కాకుండా.. దేశ భద్రత , కార్పొరేట్ నైతికతపై తీవ్రమైన ప్రశ్నలను సంధిస్తోంది.
అండర్ కవర్ ఆపరేషన్లో దిగ్భ్రాంతికర నిజాలు
నాసిక్ పోలీసుల విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. సయ్యద్ జైదుద్దీన్ అనే వ్యక్తి టీసీఎస్ నియామక ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ, తన వర్గానికి చెందిన వారినే పెద్ద ఎత్తున సంస్థలోకి చేర్చుకున్నారు. అలాగే ఉద్యోగాల్లో చేరిన ఇతర వర్గాలకు చెందిన మహిళలు ఇస్లాంలోకి మారేందుకు ఒత్తిడిచేస్తున్నారు. పోలీసులు జరిపిన స్టింగ్ ఆపరేషన్లో ఈ వ్యవహారం నిజమేనని తేలడం సంచలనం సృష్టించింది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పిదమా? లేక దీని వెనుక ఏదైనా వ్యవస్థీకృత నెట్వర్క్ ఉందా? అనే కోణంలో విచారణ సాగుతోంది.
కార్పొరేట్ నైతికతకు తూట్లు
టాటా వంటి గ్రూపులు నైతికతకు, నిష్పాక్షికతకు మారుపేరుగా నిలుస్తాయి. అలాంటి సంస్థలో ఒక విభాగం మొత్తం ఒకే వర్గం చేతుల్లోకి వెళ్లడం, ఇతర అర్హత గల అభ్యర్థులకు అన్యాయం జరగడం అనేది కార్పొరేట్ పాలన లోని వైఫల్యాన్ని సూచిస్తోంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ,ఇంటర్నల్ ఆడిట్ వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున పక్షపాత ధోరణి ఎలా కొనసాగిందనేది విస్మయం కలిగిస్తోంది. దీనివల్ల సంస్థ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, ఉద్యోగుల మధ్య అసమానతలు , అభద్రతా భావం పెరిగే ప్రమాదం ఉంది.
నియంత్రణే మార్గం
ఈ ఉదంతం ఇతర కార్పొరేట్ సంస్థలకు ఒక హెచ్చరిక. నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండటంతో పాటు, రిక్రూట్మెంట్ విభాగాలపై నిరంతర నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. జిహాద్ వంటి పదాల వినియోగం రాజకీయ చర్చలకు దారితీసినప్పటికీ, క్షేత్రస్థాయిలో జరిగిన పక్షపాతాన్ని విస్మరించలేం. ఏదైనా ఒక వ్యవస్థను నిర్దిష్ట భావజాలం ఉన్నవారు తమ గుప్పిట్లోకి తీసుకుంటే అది ఆ వ్యవస్థ పతనానికి దారితీస్తుంది. నాసిక్ ఘటనతో ఐటీ రంగం తన నియామక విధానాలను పునఃసమీక్షించుకోవాల్సిన తక్షణ అవసరం ఏర్పడింది. ఏ రంగంలోనైనా ప్రతిభకు పట్టం కట్టాలి తప్ప, కుల మతాలకు తావుండకూడదు. నాసిక్ టీసీఎస్ ఘటన మన కార్పొరేట్ వ్యవస్థల్లోని లొసుగులను ఎత్తిచూపింది. కరెక్ట్ చేసుకోవాల్సింది ఐటీ రంగమే.
