రానాకి ఉరిశిక్ష !

స్టార్స్ ని న‌మ్ముకోకుండా, చిన్నవాళ్లతో కొత్త వాళ్లతో సినిమాలు తీసి హిట్లు ఇచ్చాడు తేజ. ఆయ‌న చేతుల మీదుగా చాలామంది న‌టులు,టెక్నీషియ‌న్స్ వెలుగులోకి వ‌చ్చారు. అయితే కొన్నేళ్లుగా తేజ హిట్లు లేక త‌న వైవ‌భ‌వాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మ‌ళ్లీ త‌నను తాను నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. ఈసారీ కొత్తవాళ్లతో కాకుండా రానా -కాజల్ లాంటి స్టార్ కాస్ట్ ను పెట్టి ‘నేనే రాజు నేనే మంత్రి`టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకి సంబధించిన స్టోరీ పై ఓ చిన్న లీక్ బయటికివచ్చింది. ఇదో పొలిటికల్ సెటైరట. చట్టంలో వున్న లొసుగులు, వ్యవస్థలో వున్న డొల్లతనం ఉపయోగించుకుకొని అడ్డంగా ఎదిగే ఓ వ్యక్తి కధట. ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఆసక్తిగా డిజైన్ చేశాడట తేజ. క్లైమాక్స్ లో కోర్టు సీన్ ఒకటి రాసుకున్నాడు. విశేషం ఏమిటంటే.. కోర్టు హీరో రానాకి ఉరిశిక్ష అమలు చేస్తుందట. జనరల్ గా ఇలాంటి యాంటి క్లైమాక్స్ లో టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చవు. అయితే ఇది తేజ సినిమా. అందుకే ఉరిశిక్ష అమలుని కూడా ఇందులో చుపిస్తాడని టాక్. మొత్తంమ్మీద చాలా రోజుల తర్వాత స్టార్ ప్యాకింగ్ తో తేజ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.