ఇచ్చేయండి సార్… థియేట‌ర్లు ఇచ్చేయండి!

సంక్రాంతి సినిమాల గురించి ఎంత మాట్లాడుకొన్నారో, థియేట‌ర్ల ఇష్యూ గురించి కూడా అంతే మాట్లాడుకొన్నారు. ముఖ్యంగా ‘హ‌నుమాన్’ సినిమాకి ఎక్క‌డా థియేట‌ర్లు దొర‌క‌లేదు. 12న గుంటూరు కారంతో హ‌నుమాన్ అనే ఓ చిన్న సినిమా పోటీ ప‌డ‌డం కూడా అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యాన్ని నింపింది. హ‌నుమాన్ అన‌వ‌స‌రంగా రిస్క్ చేస్తోంద‌ని, ఓరోజు ముందు వ‌చ్చినా హ‌నుమాన్ గ‌ట్టెక్కేద‌ని సానుభూతి తెలిపారు. ‘హ‌నుమాన్’ సినిమాకి త‌క్కువ థియేట‌ర్లు దొరికినా, ఎవ‌రూ ఏం అన‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే ఎదురుగ్గా ఉన్నది మ‌హేష్ బాబు సినిమా. డిస్టిబ్యూట‌ర్లు, ఎగ్జిబ్యూట‌ర్లు ఎవ‌రైనా స‌రే… గుంటూరు కారం వైపే చూస్తారు. కాబ‌ట్టి… స‌హ‌జంగానే హ‌నుమాన్‌కి థియేట‌ర్ల విష‌యంలో మొండిచేయి ఎదుర‌వుతుంది. ఈ విష‌యం హ‌నుమాన్ టీమ్ కీ బాగా తెలుసు.

కాక‌పోతే ‘హ‌నుమాన్’ కంటెంట్ ని గ‌ట్టిగా న‌మ్ముకొంది. తొలి రోజు థియేట‌ర్లు దొర‌క్క‌పోయినా మౌత్ టాక్ తో కొత్త థియేట‌ర్లు వ‌స్తాయ‌ని న‌మ్మింది. అంతే కాదు.. మిగిలిన మూడు సినిమాల్లో ఏ ఒక్క‌టి డ‌ల్ అయినా అది హ‌నుమాన్‌కి ప్ల‌స్. అన్నింటికంటే ముఖ్యంగా శుక్ర‌, శ‌ని, ఆది, సోమ‌, మంగ‌ళ ఇలా.. అన్ని రోజులూ సెల‌వ‌లే. కాబ‌ట్టి మెల్ల‌గా అయినా థియేట‌ర్ల సంఖ్య పెంచుకోవొచ్చు. ప్రేక్ష‌కులూ సినిమాని చూడ్డానికి రెడీగానే ఉంటారు. ఈ క్యాలిక్లేష‌న్స్ హ‌నుమాన్ విష‌యంలో వ‌ర్క‌వుట్ అయ్యేలానే ఉన్నాయి. గురువారం హ‌నుమాన్ ప్రీమియ‌ర్ల‌కు ఊహించ‌ని స్పంద‌న వ‌చ్చింది. రివ్యూలు రేటింగుల్లో ఆధిప‌త్యం సంపాదించింది. అదే స‌మ‌యంలో గుంటూరు కారం టాక్ డీలా ప‌డిపోయింది. తొలిరోజు మ‌హేష్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా, అడ్వాన్స్ బుకింగుల దృష్ట్యా.. ‘గుంటూరు కారం’కి తిరుగు ఉండ‌క‌పోవొచ్చు. కానీ రెండో రోజైనా స‌రే… `హ‌నుమాన్‌`కి థియేట‌ర్లు వ‌ద‌లాల్సిందే. కాక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కూ ‘మాకు థియేట‌ర్లు ఇవ్వండి’ అని హ‌నుమాన్ టీమ్ అడిగేది. ఇప్పుడు వాళ్లే. ‘మా థియేట‌ర్లో మీ బొమ్మ వేసుకోండి’ అని హ‌నుమాన్ టీమ్ ని అడ‌గాల్సివ‌స్తుంది. సినిమా చిన్న‌దైనా, పెద్ద దైనా రిజ‌ల్ట్ లో తేడా వ‌స్తే… ఇంతేమరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close