రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమితో ప్రధాన బిల్లు ప్రక్రియ ముగిసింది. ఈ రోజు మళ్లీ లోకసభ సమావేశం అవుతుంది. ఈ రోజు సభలో ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా ారింది. ఈ రోజు లోక్సభలో నిన్నటి ఓటమిపై ప్రభుత్వ పక్షం తీవ్రమైన వాదనలు వినిపించే అవకాశం ఉంది.
మహిళలను మోసం చేశారని ప్రకటించే చాన్స్
మహిళల హక్కుల కోసం, దేశాభివృద్ధి కోసం మేము చారిత్రాత్మక బిల్లును తెస్తే.. విపక్షాలు కేవలం తమ రాజకీయ ఉనికి కోసం దానిని అడ్డుకున్నాయి అని ప్రధాని సభలో ప్రకటన చేసే అవకాశం ఉంది. బిల్లు వీగిపోయిన తర్వాతి రోజు కావడంతో, దీనిపై సభలో వాడివేడి చర్చలు జరగడం ,విపక్షాల తీరును నిరసిస్తూ ప్రభుత్వం ప్రజా క్షేత్రంలోకి వెళ్లే కార్యాచరణను ప్రకటించడం వంటి ఆలోచనలు ఎన్డీఏ చేస్తోంది.
వ్యూహాత్మక ఓటమి వెనుక బీజేపీ లాభమేంటి?
మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలను విపక్షాలే అడ్డుకున్నాయని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారిని ప్రగతి నిరోధకులు గా చిత్రీకరించే అవకాశం బీజేపీకి దక్కింది. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న విపక్షాల వాదనను మహిళా రిజర్వేషన్ వ్యతిరేకత తో బీజేపీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందిని అనుకోవచ్చు.
విపక్షాల ఉచ్చు.. బీజేపీ ప్లాన్
విపక్షాలు ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా విజయం సాధించామని సంబరపడుతున్నప్పటికీ, మోదీ-షా మార్క్ పాలిటిక్స్ ప్రకారం.. ఇది వారిని బలి పశువులను చేసే ఎత్తుగడ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ విఫలమైన బిల్లు ను బీజేపీ ఒక విప్లవాత్మక అజెండాగా మార్చుకుని ఊరూరా ప్రచారం చేయనుంది. తద్వారా పార్లమెంటులో జరిగిన ఓటమిని ప్రజా కోర్టులో గెలుపుగా మార్చుకోవడమే ఈ నెక్స్ట్ లెవల్ రాజకీయ వ్యూహం.
