నిహారిక భ‌లే అడిగింది

ఓ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌రావ‌డం అరుదైన సంగ‌తి. హీరోయిన్ అనే స‌రికి స్కిన్ షో.. అనుకొంటారు. తాము ఎంత‌గానో అభిమానించే ఓ న‌ట కుటుంబం నుంచి ఓ క‌థానాయిక వ‌స్తోందంటే ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేరు. కానీ. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక వ‌చ్చింది. ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్ అయ్యింది. మ‌రి నిహారిక‌కు ఎవ‌రూ అడ్డు చెప్ప‌లేదా? ‘నో’ అన‌లేదా? ఎందుకు అన‌లేదు. `నేను హీరోయిన్ అవుతా` అని నిహారిక అడ‌గ్గానే నాగ‌బాబు అంద‌రు తండ్రుల్లానే ‘నో’ అన్నాడు. కానీ నిహారిక డాడీనే దిమ్మ‌దిరిగే ప్ర‌శ్న ఒక‌టి అడిగింది. ”మ‌న ఇంటి నుంచి హీరోలొస్తున్న‌ప్పుడు యంక‌రేజ్ చేశారు? న‌న్ను చేయ‌రా, త‌ప్పేంటి” అని నిల‌దీసింది. ఆ ప్ర‌శ్న‌కు నాగ‌బాబు ద‌గ్గ‌ర కూడా స‌మాధానం లేకుండా పోయింది.

ఈ విష‌యాన్ని ఒక మ‌న‌సు ఆడియో ఫంక్ష‌న్లో నాగ‌బాబు స్వ‌యంగా అభిమానుల‌తో పంచుకొన్నారు. త‌ల్లిదండ్రుల ఆలోచ‌నా ధోర‌ణి మారాల‌ని, అమ్మాయిల మ‌న‌సుల్లో ఏముందో తెలుసుకొని, వాళ్లని ప్రోత్స‌హించాల‌ని, అమ్మాయిని అత్తావారింటికి పంపించ‌డ‌మే పెద్ద బాధ్య‌త అనుకోకండి అని.. నాగ‌బాబు హిత‌వు ప‌లికాడు. మెగా కుటుంబంలోని హీరోల ఆలోచ‌న ధోర‌ణి చాలా కూల్‌గా ఉంటుంద‌ని, అందుకే త‌మ ఇంట్లోంచి ఓ అమ్మాయి క‌థానాయిక అవుతుంటే పెద్ద మ‌న‌సుతో ఆలోచించారని, వాళ్ల విశాల హృద‌యానికి అదే నిద‌ర్శ‌న‌మ‌ని నాగ‌బాబు చెప్పుకొచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ పర్సంటేజీ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతేనా ?

ఏపీలో పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా రెండు శాతం పెరిగింది. ఈ రెండు శాతం చిన్నది కాదు. ఎందుకంటే హై పోలింగ్ లో ఎంత చిన్న మొత్తం పెరిగినా...

రేవంత్‌కు రుణమాఫీ అంత వీజీ కాదు !

రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రేవంత్ డెడ్ లైన్ పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయింది. హామీని పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఇప్పుడు రెండు...

అదే వైసీపీ కొంపముంచనుందా..?

ఏపీలో అధికారపీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎవరిని కదిలించినా ఫలితాల గురించే ముచ్చట. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో కూటమిదే విజయమని...

‘మిరల్’ రివ్యూ: చీకటి నాటకం

ఈ సమ్మర్ లో సరైన సినిమా పడలేదు. అక్యుపెన్సీ లేకపోవడంతో సింగిల్ స్క్రీన్స్ రెండు వారాలు క్లోజ్ చేస్తున్నట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ వారం రావాల్సిన సినిమాలు వెనక్కి వెళ్ళాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close