నితిన్ ఏంటి… ఇలా షాక్ ఇచ్చాడు?

జ‌యం నుంచి చూస్తే… నితిన్ గెట‌ప్‌లో పెద్ద‌గా మార్పులేం క‌నిపించ‌లేదు. నూనూగు మీసాలతో ఎప్పుడూ చాక్లెట్ బోయ్‌లానే క‌నిపించేవాడు. అప్పుడ‌ప్పుడూ లైట్ గా కాస్త గెడ్డం పెంచేవాడంతే. ఇప్పుడు మాత్రం.. స‌రికొత్త లుక్‌తో వ‌చ్చేశాడు. నిండుగా గ‌డ్డం పెంచి కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. అఆ త‌ర‌వాత హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించే ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు నితిన్‌. ఈ సినిమా ఈరోజే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. నితిన్‌ని చూస్తే గ‌డ్డం పెంచుకొన్న యువ రుషిలా ఉన్నాడు. ఆమ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా గ‌డ్డాన్ని ఇలానే పెంచుకొని… ఆ లుక్‌లో నెల‌ల త‌ర‌బడి క‌నిపించాడు. ప‌వ‌న్ వీరాభిమాని అయిన నితిన్ కూడా ఇప్పుడు అదే స్టైల్‌లోకి మారిపోయాడు. ఈ సినిమా కోస‌మే నితిన్ గ‌డ్డం పెంచాడ‌ట‌. ఈ సినిమా మొత్తం నితిన్ ఇలానే క‌నిపించ‌నున్నాడ‌ని టాక్‌. హ‌ను రాఘ‌వ పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం.. ఓ ప్రేమ‌క‌థా నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది తెలియాల్సివుంది.

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ – ”ఇదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. నితిన్‌తో ఫస్ట్‌టైమ్‌ వర్క్‌ చేయడం చాలా సంతోషంగా వుంది. అందర్నీ ఆకట్టుకునే చక్కని ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లో ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ తర్వాత చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది” అన్నారు. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close