ఏపీ సర్కార్ “పవర్” తీసేసిన నీతి ఆయోగ్ !

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ నియంత్రణ వ్యవస్థ… ఎంత దారుణంగా ఉందో కరెంట్ కోతలే నిరూపిస్తున్నాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ మరోసారి లెక్కల ద్వారా చెప్పింది.స్టేట్‌ ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ ఇండెక్స్‌ లో ఆంధ్రప్రదేశ్‌కు ఓవరాల్‌గా 18వ స్థానలో నిలబడింది. రాష్ట్రాల్లో ఈ స్థానం పన్నెండోది. నీతి అయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ఈ నివేదిక విడుదల చేశారు. 20 పెద్ద రాష్ట్రాల విభాగంలో పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్‌ , కేరళ , పంజాబ్‌ అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఎపికి మూడు సూచిల్లో సున్నా, ఐదు సూచిల్లో పది కంటే తక్కువ స్కోరు వచ్చాయి. కొత్త విధానాల కల్పనలో పూర్తిగా జీరో ఫలితాలు వచ్చాయి.

విద్యుత్‌ వాహనాలు, ఛార్జిరగ్‌ సౌకర్యాల కల్పన, వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటులో నిల్‌గా నివేదిక చూపిరచిరది. ఇక డిస్కమ్‌ల పనితీరుకు సంబంధిరచి రుణ విభాగం, నేరుగా నగదు బదిలీ విభాగాల్లో జీరో స్కోర్‌ సాధించింది. ఎపి వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో మాత్రం కేవలం 5.6 స్కోర్‌కే పరిమితమైంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ను తొమ్మిది గంటలపాటు అరదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు కానీ అది అవాస్తవమని ఈ లెక్కలు చెబుతున్నాయి.

కొసమెురుపేమింటే… ఏపీకి కాస్తోకూస్తో మార్కులు వచ్చాయంటే దానికి కారణం విద్యుత్ చార్జీలు. వినియోగదారులకు విద్యుత్‌ ఛార్జీల అమలులో మాత్రం వంద శాతం మార్కులు పడ్డాయి. అంటే మిగతా ఏ వ్యవస్థలోనూ పరిస్థితి బాగోలేకపోయినా చార్జీలను మాత్రం ముక్కు పిండి వసూలు చేయడంలో ఏపీ విద్యుత్ సంస్థలు ముందున్నాయన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close