నితీష్ గెలిచారు సరే..ఐదేళ్ళ పాటు ఆ ముళ్ళ కిరీటం ధరించగలరా?

బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ల మహా కూటమి మీడియా సంస్థలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సీట్లు గెలుచుకొని అధికారంలోకి రాబోతోంది. ఇంతవరకు వెలువడిన ఫలితాలలో మహా కూటమి 29 సీట్లు గెలుచుకొని మరో 149 స్థానాలలో స్పష్టమయిన ఆధిక్యతతో మొత్తం 178 సీట్లు గెలుచుకొని తిరుగులేని విజయం స్వంతం చేసుకోబోతోంది.

ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పరిస్థితి చాల దయనీయంగా ఉంది. ఎన్డీయే కూటమి ఇంతవరకు కేవలం 7సీట్లు మాత్రమే గెలుచుకొని మరో 52స్థానాలలో ఆధిక్యతతో కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి కనీసం 90-100 సీట్లయిన గెలుచుకోవచ్చునని ప్రకటించాయి. కానీ కేవలం 59 సీట్లు మాత్రమే గెలుచుకోబోతోంది.

ఈ ఎన్నికలలో మహాకూటమి విజయం సాధించబోతోందని మీడియా సంస్థలు కనిపెట్టగలిగాయి కానీ మహా కూటమికి వచ్చిన సీట్ల సంఖ్యను చూస్తే అవి బిహార్ ప్రజల నాడిని పూర్తిగా పట్టుకోలేకపోయాయని అర్ధం అవుతోంది.

ఈ ఎన్నికలలో మోడీ-నితీష్ పరిపాలన, అభివృద్ధి అజెండాపైనే జరిగాయని అందరికీ తెలుసు. కానీ, ఈ ఎన్నికలలో వాళ్ళిద్దరే వెనుకబడి ఉండటం గమనార్హం. మహా కూటమి ఎన్డీయే కూటమిపై విజయం సాధించడం మోడీ పరాజయంగా భావించినట్లయితే, మళ్ళీ మహా కూటమిలో భాగస్వాములయిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ఇరువురిలో అవినీతిపరుడని పేరుపడ్డ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకే ఎక్కువ సీట్లు రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. నితీష్ కుమార్ పార్టీ (జె.డి.యు) కి మొత్తం 71 సీట్లు సాధించబోతుంటే, లాలూ పార్టీ( ఆర్.జే.డి.) 81 సీట్లు గెలుచుకోబోతోంది. ప్రజలు నితీష్ కుమార్ ని చూసి ఓటేసినప్పుడు జె.డి.యు. పార్టీకే ఎక్కువ సీట్లు కట్టబెట్టాలి కానీ లాలూ ప్రసాద్ యాదవ్ వైపు ఎక్కువ మొగ్గు చూపడం విశేషం.

అందుకు అనేక అంశాలు దోహదపడి ఉండవచ్చును. కానీ ఈ కారణంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న నితీష్ కుమార్ కుమార్ కి మున్ముందు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చును.

ఈరోజు వారిరువురు కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని లాలూ ప్రసాద్ యాదవ్ మళ్ళీ మరొక్కమారు స్పష్టం చేసారు. అంతమాత్రాన్న లలూకి ఆశలు లేవని కాదు. తాజా సమాచారం ప్రకారం ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన ఇద్దరి కుమారులు కూడా విజయం సాధించారు కనుక వారికీ ప్రభుత్వంలో కీలకమయిన మంత్రి పదవులు డిమాండ్ చేయవచ్చును. నితీష్ కుమార్ పార్టీ కంటే లాలూ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చేయి కనుక ఇక నుండి నితీష్ కుమార్ ఆయన ముందు అణిగిమణిగి చాలా జాగ్రత్తగా ప్రభుత్వం నడిపించుకోవలసి ఉంటుంది. అంటే నితీష్ కుమార్ ఐదేళ్ళపాటు లాలూ ప్రసాద్ యాదవ్ అనే ముళ్ళ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకొని పరిపాలన చేయాలన్న మాట. కనుక దీనిని నితీష్ కుమార్ విజయమనుకోవాలా లేక అగ్ని పరీక్షనుకోవాలా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close