బ్యాలెట్‌తో నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక…?

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక.. దేశంలో అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం కనిపిస్తోంది. నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి దాదాపు 190 మంది రైతులు నామినేషన్లు వేశారు. వీరు అందరూ బరిలో నిలిచే అవకాశం ఉంది. సాధారణంగా ఒక ఈవీఎంలో 16మంది అభ్యర్థుల పేర్లు, వారి గుర్తులను ఇచ్చేందుకు అవకాశం ఉంది. 16కంటే ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉంటే రెండో ఈవీఎంను కంట్రోల్‌ యూనిట్‌కు జత చేస్తారు. నిజామాబాద్‌లో బరిలో నిలిచిన 190మంది అభ్యర్థులు ఉన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అన్నదానిపై అధికారులు చర్చిస్తారు. బ్యాలెట్ల ముద్రణకు పట్టే సమయం, అభ్యర్థులు కేటాయించాల్సిన గుర్తులు, ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆ బ్యాలెట్‌ పత్రాలను భద్ర పరిచేందుకు కావాల్సిన బాక్సులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

1996 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి 480మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆ అభ్యర్థులు, వారి గుర్తులతో కూడిన 50పేజీల బుక్‌లెట్‌ను ముద్రించింది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికమంది అభ్యర్థులు పోటీ చేసిన సందర్భం అదే. నిజామాబాద్ రైతులందరూ.. తమ సమస్యలు.. దేశం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ విధంగా నామినేషన్లు వేశారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు ప్రతీ ఏడాది మద్దతు ధర లభించదు. వారు ఆందోళన చేస్తూనే ఉంటారు. కానీ ప్రభుత్వం పట్టించుకున్న సందర్భాలు లేవు. తెలంగాణ సర్కార్ పై ఈ విషయంలో… మండి పడిన రైతు సంఘాలు వినూత్న కార్యాచరణతో నిరసన తెలుపుతున్నారు.

దానిలో భాగంగానే.. ఇప్పుడు నామినేషన్లు వేశారు. ఈ విషయం తెలిసి.. సిట్టింగ్ ఎంపీ కవిత… సమస్య అంతా… మోడీ దగ్గరే ఉందని.. ఆయన నియోజకవర్గంలో నామినేషన్లు వేద్దామని పిలుపునిచ్చారు. కానీ.. రైతులు మాత్రం నిజామాబాద్‌లోనే వేశారు. రైతుబంధు పథకంతో… రైతుల్ని రాజుల్ని చేశామని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వానికి ఇది ఇబ్బందికర పరిణామమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close