కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం..! శుక్రవారమే చర్చ..!!

నరేంద్రమోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, తోట నర్సింహం, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ తెలిపారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో చదివి వినిపించారు. సభ ఆర్డర్ లో ఉండటంతో అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపేవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ కోరారు కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ పార్టీ ఎంపీలందరూ… అవిశ్వసానికి మద్దతుగా నిలబడ్డారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలంటే.. 50 మంది ఎంపీల మద్దతు ఉండాలి. అంత కన్నా ఎక్కువగానే ఎంపీల మద్దతు ఉండటంతో… అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతినిస్తామని స్పీకర్ ప్రకటించారు. శుక్రవారం చర్చ జరపాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 10 రోజుల్లోగా అవిశ్వాసంపై చర్చ చేపట్టాలి. కానీ స్పీకర్ సుమిత్రా మహాజన్ చాలా ముందుగా చర్చ తేదీని ఖరారు చేశారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస నోటీసును పరిగణనలోకి తీసుకోవడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అతిపెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పట్టించుకోకుండా టీడీపీ పెట్టిన అవిశ్వాసాన్ని తీసుకోవడం ఏంటని మల్లిఖార్జున్ ఖర్గే ప్రశ్నించారు. అయితే నిబంధనల ప్రకారమే అవిశ్వాస నోటీసులపై నిర్ణయం తీసుకున్నానని స్పీకర్ స్పష్టం చేశారు.

టీడీపీ అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్‌కు చెందిన ఎంపీలు మద్దతు ఇవ్వలేదు. తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ తమకు ఆదేశాలు ఇవ్వలేదని ఎంపీలు చెబుతున్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలబడ్డారు. ఆయా పార్టీల బలం ఆధారంగా… ఎవరెవరికి ఎంత ఎంత సేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలో స్పీకర్ ఖరారు చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ లో 535 మంది సభ్యులున్నారు. బీజేపీకి సొంతంగా సాధారణ మెజార్టీ ఉంది. బీజేపీ పాలనా వైఫల్యాన్ని ఎండగట్టడానికి… ఈ అవిశ్వాసాన్ని విపక్ష పార్టీలు ఓ అవకాశంగా ఉపయోగించుకోనున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close