చైతన్య : ఆంధ్రులంటే వీళ్లు – తెలంగాణ సెక్రటేరియట్ గొప్ప- ఏపీలో మాత్రం కులం ముద్ర !

తెలంగాణ సెక్రటేరియట్ గొప్పగా కట్టుకున్నారు. చూసి రావాల్సిందేనని.. ఆంధ్రులు వాళ్లకూ వీళ్లకూ చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి తెలంగాణ సెక్రటేరియట్ ఫోటోలు చూసిన ఎవరికైనా… మా ఊరిలో ఇంజనీరింగ్ కాలేజీలాగే ఉందే అని అనుకోకుండా ఉండరు. కానీ ఆ నిర్మాణం వెనుక జరిగిన ప్రచారం అంతకు మించి.. మనసులో పెట్టుకున్న కుల గజ్జి కారణంగా.. అది చాలా గొప్పగా ఉంటుంది. అందుకే.. గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ తెలంగాణలో ఒక్క భవనమే నిర్మించారు.. ఏపీకి ఓ రాజధానినే నిర్మించే మహా సంకల్పం చేపడితే.. మాత్రం.. కట్టకూడదని దాన్ని కులానికి అంటగట్టి కూల్చేసుకున్నారు. అంటే పొరుగువారు బాగుపడితే సంతోషిస్తాం కానీ మనల్ని మనం బాగు చేసకుంటామంటే మాత్రం… దానికి కులం వచ్చేస్తుంది…అదీ ఆంధ్రుల మైండ్ సెట్.

తెలంగాణ అభివృద్ధి ఆహా..ఓహో

తెలంగాణ తోపాటు ఏపీ ఒకే సారి పయనం ప్రారంభించాయి. మొదటి ఐదేళ్లలో తెలంగాణ ఎలా ఉంది.. ఆంధ్ర ఎలా ఉంది. తెలంగాణ వెలవెలబోయింది. ఏపీకి రాజధాని ఉత్సాహం వచ్చింది. అమరావతికి ఊపిరి పోలీసులు పరిశ్రమలు వెల్లువలా వచ్చాయి. మేడిన్ ఆంధ్రా కార్లు ప్రపంచం మొత్తం పరుగులు పెడుతున్నాయి. ఒక్క సారి కరెంట్ చార్జలు పెంచలేదు. ఇంకా తగ్గిస్తామన్నారు. సంక్షేమం ఆగలేదు. చంద్రన్నబీమా లాంటివి నిజమైన కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నాయి. కానీ గత నాలుగేళ్లలో ఏం జరుగుతోంది.ఏపీ పునాదుల్ని కూల్చేశారు. కానీ తెలంగాణ మాత్రం ఊహించనంతగా అభివృద్ధి చెందింది. సైబరాబాద్‌కు విదేశీ నగరాల బుక్ వచ్చింది.

తెలంగాణ ప్రజల ఆస్తుల విలువ ఎన్నో రెట్లు పెరింది..కానీ ఏపీ వాసులది ?

నాలుగేళ్ల క్రితం.. తెలంగాణలో ఇళ్లు ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో ఇళ్లు రూ. యాబై లక్షలకు కూడా అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు కోటి దాటిపోయాయి. అదే సమయంలో ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోయింది. నాలుగేళ్లలోనే మూడింతలు పెరిగిపోయింది. వారేమీ చేయకుండానే వారి ఆస్తుల విలువ పెరిగింది. మరి ఏపీ ప్రజల ఆస్తుల విలువ ఎంత పెరిగాయి ? . పెరగకపోగా తగ్గిపోయాయి. పదిహేనేళ్ల కిందట ఉన్న రేటు ఇప్పుడు ఉంటోంది. అన్ని చోట్లా అదే పరిస్థితి. ఆంధ్రుల ఆస్తుల విలువ కుంచించుకుపోయినా కులం రొచ్చులో వారికి ఇప్పటికీ అర్థం కావడం లేదు.

అందరికీ కులం ఉంటుంది… కానీ కుల క్యాన్సర్ పట్టేసిన వాళ్లతోనే డేంజర్

ఫలానా కులంలో పుట్టాలని ఎవరూ అనుకోరు. అసలు కులం అనేది కనిపించనిది. మానసిక భావన మాత్రమే. జనమే నిజం. కానీ ఈ భావాల భస్మాసురాల్లాంటి ఆంధ్రులు నమ్మడం లేదు. తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకునే వరకూ అదే చేస్తున్నారు. ఎదురుగా నిజాలు కనిపిస్తున్నా.. నమ్మలేనంత దౌర్భాగ్య స్థితికి వెళ్లిపోయారు. ఇంకెప్పుడు మారతారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close