పార్టీ మార్పుపై కోట్ల స్పంద‌న ఇలా ఉంది..!

నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితాల త‌రువాత క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో మార్పుల‌కు సంబంధించి కొన్ని క‌థ‌నాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. దీన్లో ప్ర‌ధానంగా వినిపిస్తున్నది కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి పార్టీ మార్పు! ఆయ‌న మొద‌ట్నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాష్ట్ర విభ‌జన త‌రువాత ఆంధ్రాలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయినా, ప్ర‌ముఖ నేత‌లంతా ఇత‌ర పార్టీలోకి వెళ్లిపోయినా కోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతున్నారు. అయితే, ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న పార్టీ మార‌తార‌నే క‌థ‌నాలు వ‌స్తూనే ఉంటాయి, వాటిని ఖండిస్తూనే ఉంటారు. తాజాగా మ‌ళ్లీ అదే పరిస్థితి వ‌చ్చింది! కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరే అవ‌కాశం ఉంద‌నీ, ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబుతో కోట్ల భేటీ అయిన సంద‌ర్భంగా ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ట్టు కూడా చాలామంది అభిప్రాయ‌ప‌డ్డారు. మీడియాలో కూడా కోట్ల రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై కోట్ల స్పందించారు.

తాను పార్టీ మారే ఆలోచ‌న లేద‌నీ, అలా వ‌స్తున్న క‌థ‌నాల్లో ఎలాంటి వాస్త‌వం లేవ‌ని సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లోనే కొన‌సాగుతాన‌నీ, పార్టీకి భ‌విష్య‌త్తు లేక‌పోతే తాను రాజ‌కీయాల నుంచి దూరం అవుతాన‌ని, వ్య‌వ‌సాయం చేసుకుంటాన‌ని చెప్పారు. అంతేత‌ప్ప‌, ఇత‌ర పార్టీల్లో చేరే ఆలోచ‌న అస్స‌లు లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేసేశారు. అయితే, ఇదే సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గురించి కోట్ల‌ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఈవారంలో ముఖ్య‌మంత్రి త‌న ఇంటికి వ‌స్తాన‌ని క‌బురు పెట్టార‌న్నారు! అయితే, కార‌ణాలేవో త‌న‌కు తెలీదుగానీ ముందుగా ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం చంద్ర‌బాబు రాలేద‌ని కోట్ల చెప్పారు. ముఖ్య‌మంత్రి త‌న ఇంటికి ఎప్పుడు రావాల‌నుకున్నా మ‌న‌స్పూర్తిగా సాద‌రస్వాగ‌తం ప‌లుకుతాన‌ని కోట్ల చెప్పారు.

పార్టీ మార్పుపై కోట్ల ఇలాంటి స్ప‌ష్ట‌త ఇచ్చేశారు! ఆయ‌న అభిప్రాయం ఇలా ఉంది కాబ‌ట్టే, చంద్ర‌బాబు కోట్ల ఇంటికి వెళ్లాల‌నుకునే ఆలోచ‌న‌ను విర‌మించుకుని ఉంటార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, కోట్ల అనుచ‌ర వ‌ర్గాలు మాత్రం ఆయ‌న‌పై ఒత్తిడి చేస్తున్న‌ట్టుగానే చెబుతున్నారు! కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో భ‌విష్య‌త్తు లేద‌నీ, నేటి రాజ‌కీయాల్లో పార్టీ మార్పు అనేది స‌ర్వ‌సాధార‌ణ విష‌య‌మ‌నీ, ప్ర‌జల‌కు అందుబాటులో ఉండేందుకు ఏదో ఒక పార్టీలో చేర‌డం త‌ప్పు కాద‌నే విధంగా కోట్ల‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం కొంత‌మంది నేత‌లు చేస్తున్న‌ట్టు స‌మాచారం! కోట్ల‌తో మంత‌నాలు జ‌రిపే విష‌య‌మై తెలుగుదేశంలో కొంత చ‌ర్చ జ‌రుగుతోంద‌న్న క‌థ‌నాలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ మార్పు ఉండ‌ద‌ని కోట్ల స్ప‌ష్ట‌త ఇచ్చేసినా, ఈ క‌థ‌నాలు ఆగేట్టుగా ప‌రిస్థితి లేద‌నే అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close