పవన్.. నితిన్… ఇద్దరిలో హ్యాండ్సమ్ ఎవరు?

పవన్ కళ్యాణ్ వీరాభిమానులు, భక్తులలో నితిన్ మొదటిస్థానంలో నిలుస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ‘చల్ మోహన్‌రంగ’ ప్రీ-రిలీజ్ వేడుకలో వీళ్ళిద్దరిలో ఎవరు హ్యాండ్సమ్? అనే క్వశ్చన్, డిస్కషన్ వచ్చింది. పవనే హ్యాండ్సమ్ అంటూ నితిన్ చెప్పినా… ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ భలే వినోదాన్ని పంచింది. ‘నితిన్‌కి, నాకు మధ్య వయసులో వ్యత్యాసం వున్నా… సినిమాల పరంగా, సినిమాల్లో అనుభవం పరంగా మా మధ్య తేడా ఐదారేళ్లే’ అని పవన్ వ్యాఖ్యానించారు. అతడి స్పీచ్ పూర్తయ్యాక మైక్ అందుకున్న నితిన్… “సార్ మాట్లాడుతూ ఏజ్ గ్యాప్ అన్నారు. కాని మా ఇద్దరిలో ఇప్పుడు ఎవరండీ.. యంగ్ అండ్ స్లిమ్‌గా వున్నారు పవనే కదా! వెంటనే పవన్‌తో నాకంటే మీరే యంగ్ అండ్ స్లిమ్‌గా వున్నారు. మిమ్మల్ని చూసి నేను షాకయ్యా” అన్నాడు. ‘లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా’ అనుకునే పవన్ బదులుగా “నాకు పెద్ద కోరికలు ఏం వుండవు. సినిమాలు లేకపోతే సన్నబడిపోతా. సినిమాలంటే చాలా బరువు. అందుకని లావు అవుతా” అన్నారు.అదండీ సంగతి. భక్తుడి పొగడ్తలు, పవన్ ముసిముసి నవ్వులతో ‘చల్ మోహన్‌రంగ’ ఫంక్షన్ జరిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.