తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదని పవన్ క్లారిటీ !

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. చాలా రోజుల తర్వాత ఆయన తెలంగాణలో రాజకీయ పర్యటన చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీలక కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాలకు తలా రూ. 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఫ్యాన్స్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి మాట్లాడిన పవన్ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో తెలంగాణలో జనసేన జెండా ఎగరడం ఖాయమన్నారు.

తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన యువత, ఆడపడుచులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై చర్చించి, కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని పవన్ అన్నారు. వచ్చే సార్వత్రికి ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అణగారిన వర్గాలకు, ఆడపడచులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల నా మాటను మన్నించి ఇక్కడి నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

వచ్చే సార్వత్రికి ఎన్నికల్లో తెలంగాణలో బలాబలాలు పరిశీలించుకుని అన్ని ప్రాంతాల్లో పోటీ చేద్దాం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేసి జనసేన సత్తా చూపిద్దమని క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. అంటే తెలంగాణలో ఇక బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పడానికే పవన్ కల్యాణ్ ఈ పర్యటన పెట్టుకుని పర్యటనలు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీలో బీజేపీని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు కీలకమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close