అనేక అంశాలపై మనోగతాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

ఎన్నికలకు మరొక వారం రోజులే గడువుంది. సొంతంగా సాక్షి ఛానల్ కలిగిన జగన్, అనేక ఛానల్స్ ను ప్రభావితం చేస్తున్న చంద్రబాబు లతో పోలిస్తే, ఎలక్ట్రానిక్ మీడియాలో జనసేన కు వస్తున్న కవరేజ్ కనీసం ఒక్క శాతం కూడా ఉండడం లేదు. సోషల్ మీడియా ద్వారా జనసేన పార్టీ గురించిన విషయాలను ప్రజలకు తెలుస్తూనే ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో చురుగ్గా లేని వారికి జనసేనకు సంబంధించిన సంగతులు పెద్దగా తెలియడం లేదు ఏమో అన్న అనుమానాలు జన సైనికుల కి కూడా ఉన్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలను ప్రసారం చేయడానికి ఒకట్రెండు ఛానల్స్ ముందుకు వస్తున్నాయి. అలాంటి ఒక చానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అనేక అంశాలపై తన మనోగతాన్ని పంచుకున్నాడు. అందులోని ముఖ్యాంశాలు ఇవి –

– జనసేన పార్టీ సభ లకి హాజరయ్యే వాళ్ళు ఓటు హక్కు లేని యువకులే అంటూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శల గురించి అడగ్గా – మిగతా రాజకీయ పార్టీలు ఓటు హక్కు లేకపోతే మనుషులను మనుషులుగా కూడా చూడవు అని చెప్పడానికి ఇదే నిదర్శనం, రాజకీయ నాయకులు మాత్రం తమకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు కూడా ముందే ప్లాన్ చేసుకుంటారు, కానీ ప్రజలకు మాత్రం ఓటు హక్కు లేకపోతే అసలు పట్టించుకోరు. అది సరైన విధానం కాదు.

– గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం గురించి అడగ్గా- చంద్రబాబు అనుభవం చూసి మద్దతు ఇచ్చాను, అయితే దాదాపు ఏడాదిన్నర పాటు గమనించాక చంద్రబాబు పని తీరు నచ్చకపోవడంతో నేరుగా ఆయనకే వెళ్లి పలుమార్లు ఇలా ఇలా తప్పులు జరుగుతున్నాయని ఆయన తో చెప్పాను, అవినీతి గురించి చెప్పాను, కానీ ఆయన పట్టించుకోకపోవడంతోనే బయటకు రావాల్సి వచ్చింది.

– కమ్యూనిస్టులు దేశంలో దాదాపు గా ఉనికి కోల్పోయారు కదా, వారినెందుకు మళ్లీ బతికిస్తున్నారు అని ప్రశ్నించగా- ఇతర రాజకీయ పార్టీలు కొన్ని సమస్యలు టేకప్ చేయని సమయాల్లో, కమ్యూనిష్టులు ముందుండి ఆ సమస్య కోసం పోరాడతారు. రాజకీయంగా సీట్లు ఎక్కువగా సాధించలేకపోతుండవచ్చు కానీ, వారి భావజాలం మాత్రం ఎప్పుడు దేశంలో ఉనికి కోల్పోలేదు.

– మాయావతి తో పొత్తు పెట్టుకోవడానికి కారణం, జగన్ ఓటుబ్యాంకును చీల్చడానికేనా అని ప్రశ్నించగా, బహుజన సమాజ్వాది పార్టీకి ఒక ప్రత్యేకమైన భావజాలం ఉంది అది నాకు మొదటి నుండి నచ్చుతుంది. అందుకే ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాం.

– టీడీపీతో జనసేన కుమ్మక్కు అయ్యింది అని జగన్ చేస్తున్న ఆరోపణల గురించి ప్రశ్నించగా- జగన్ కి తాను మద్దతు ఇవ్వలేదని జగన్ కు కడుపు మంట అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలకు, మూడో పార్టీ రావడం ఇష్టం ఉండదు. అందుకే ఎంత సేపు ఇద్దరూ కలిసి మూడో పార్టీ రాకుండా చేద్దామని ప్రయత్నిస్తూ, ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు.

– కేసీఆర్ తో కలిస్తే తప్పేంటి అన్న జగన్ వ్యాఖ్యలపై అడగగా – అదే విషయాన్ని నేరుగా ప్రజలకు చెప్పి ఓట్లు అడగమని నేను చెబుతున్నాను. కేసీఆర్, జగన్, అమిత్ షా ముగ్గురు పార్ట్నర్స్ కదా, మరి ముసుగులో గుద్దులాట ఎందుకు, ముగ్గురూ కలిసి ఒకే వేదిక పంచుకుని ప్రజలను ఓట్లు అడగండి. కేసీఆర్ ఆంధ్రుల పై దాడి చేస్తున్నాడు అని నేను చెప్పిన విషయం కూడా నిజమే, ఎంతోమంది పారిశ్రామికవేత్తలను, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నవాళ్లను కేసీఆర్ బెదిరిస్తున్న మాట వాస్తవమే. కేసీఆర్ ని ఉద్యమ నేత గా గౌరవిస్తాను, కానీ ఆంధ్రలో ఎవరు అధికారంలోకి రావాలి అన్నది ఇక్కడ కూర్చుని కేసీఆర్ నిర్ణయిస్తా అనడం సరైన పద్ధతి కాదు.

– ఎన్నికలయ్యాక కింగ్ అవుతానా, కింగ్ మేకర్ అవుతానా అని ఆలోచించడం లేదు. అలాంటి లెక్కలు నేను ఎప్పుడు వేసుకోను. సమాజంలో ఎంతో కొంత మార్పును తీసుకు రాగలిగితే రాజకీయాల్లో నేను సరైన ముందడుగు వేసినట్లు గా నేను భావిస్తాను.

– ఉచిత విద్య గురించి జనసేన ప్రవేశపెట్టిన స్కీం గురించి, దానికి అయ్యే ఖర్చు గురించి అడగగా – పుష్కరాల కోసం చంద్రబాబు నాయుడి గారి ప్రభుత్వం వందలాది కోట్లు ఖర్చు పెట్టింది. మనదేశంలో ఇలాంటి మతాచారాల విషయంలో ప్రభుత్వ పాత్ర పరిమితంగా ఉంటే బాగుంటుంది. ఆ వందలాది కోట్ల ప్రభుత్వ పాఠశాలల కోసం ఖర్చు పెట్టి ఉంటే సమాజానికి మంచి జరిగి ఉండేది.

– దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెన్షన్ ఇస్తాం అని ప్రకటించడం గురించి అడగ్గా- కేవలం ఒక్క రోజు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్లకు కూడా జీవితాంతం ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్నాయి. దేశానికి వెన్నుముక లో ఉన్న రైతు కి ఎటువంటి ఆసరా ఇవ్వడం లేదు. అయితే రైతుల కష్టాలన్నీ దగ్గర నుంచి చూడటం వల్లే రైతులకు పెన్షన్ అన్న స్కీం ప్రకటించాను.

ఇదీ స్థూలంగా పవన్ కళ్యాణ్ మనోగతం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close