చంద్రబాబు కోసం రోడ్లపైకి వస్తున్న జనం !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం టీడీపీ నేతలు నిరాహారదీక్షలు.. ఇతర కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం స్వచ్చందంగా రోడ్ల మీదకు వస్తున్నారు. వారికి వారు మాట్లాడుకుని ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఉన్న అత్యంత ఘోరమైన ఎమర్జెన్సీ తరహా నిర్బంధాల మధ్య కూడా ప్రజలు అనూహ్యంగా రోడ్ల మీదకు వస్తూండటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. రెండు రోజుల కిందట విజయవాడ బెంజ్ సర్కిల్ లో మహిళల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తాజాగా శనివారం గుంటూరులో మహిళలు ఆ బాధ్యత తీసుకున్నారు. ఒక్క సారిగా నాలుగైదు వేల మంది మహిళలు రోడ్లపైకి వచ్చారు. ఇలా వచ్చారని తెలిసి ఇతర మహిళలూ వారితో జత కలిశారు.

చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు చేయాలనుకుంటున్న సామాన్యులు, కాలనీల ప్రజలు వారికి వారు మాట్లాడుకుని.. ఓ సమయం చూసుకుని ర్యాలీలు ప్రారంభిస్తున్నారు. ఈ స్వచ్చంద నిరసనలు అంతకంతకూపెరుగుతున్నాయి. ముందు కృష్ణా జిల్లా మహిళలు ప్రారంభించారు. మెల్లగా ఇతర నగరాలకు విస్తరిస్తున్నాయి. ఇక గ్రామాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ గ్రామంలోనూ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దేవుడికి కొబ్బరి కాయలు కొట్టడం వంటి వాటి దగ్గరనుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులతో అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

మరో వైపు తెలంగాణలో కూడా నిరసన పెరుగుతున్నాయి. మొన్న ఖమ్మం, సత్తుపల్లిలో నిరసనలు జరిగాయి. తాజాగా నల్లగొండ జిల్లా కోదాడ, నిజామాబాద్ వంటి చోట్ల కూడా ప్రజలు స్వచ్చందంగా ర్యాలీలు నిర్వహించారు. ఇక హైదరాబాద్ గురించి చెప్పాల్సి పని లేదు. వీరిలో టీడీపీ సానుభూతిపరులు ఉన్నా.. ప్రస్తుతం అక్కడ పార్టీ కార్యకలాపాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు వందల సంఖ్యలో ర్యాలీలో పాల్గొనడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యపోతుంది.

మరో వారం కూడా చంద్రబాబు ప్రజా ఉద్యమం ఉద్ధృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగినా ఆశ్చర్యం లేదన్న సంకేతాలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close