బండి సంజయ్‌పై పేర్ని నాని ఘోరమైన వ్యాఖ్యలు !

వైసీపీలో ఒక్కరంటే ఒక్కరూ సక్రమంగా ఉండరు. రాజకీయ విమర్శల్ని రాజకీయంగా తీసుకోవడం కూడా ఉండదు. వారూ..వీరూ అనేమీ ఉండదు. నోరుంది కదా అని మీద పడిపోతూంటారు. ఎదురు తిరిగి అన్నా.. పరువు , ప్రతిష్టలు..లాంటివేమీ తమకు ఉండవని వారు గట్టిగా ఫిక్సయి ఉంటారు. అలాంటి వారిలో పేర్ని నాని మరీ ముందు ఉంటారు.

ఏపీ నేతలు ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై ఆయన చేసే ఘోరమైన కామెంట్ల గురించి చెప్పాల్సిన పని లేద. తాజాగా ఆయన తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ పై ఘోరమైన కామెంట్లు చేశారు. పక్క రాష్ట్రంలో పదవిపోయిన వాడు వచ్చి ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు దేవుడు పైన ఊడగొడితే.. బీజేపీ కింద ఊడగొట్టిందన్నారు. అంటే.. బండి సంజయ్ కు బట్ట తల వచ్చిందని.. టీ బీజేపీ అధ్యక్ష పదవిని తీసేశారని పేర్ని నాని ఉద్దేశం.

పైన ఊడి పోయిన వాడు ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ వైసీపీని విమర్శిస్తున్నారన్నారు. బండి సంజయ్‌కు దేవుడు పైన ఊడగొట్టాడని.. బీజేపీ కిందున్న ఛైర్ ఊడగొట్టిందని సెటైర్ వేశారు. ఉత్తర భారతంలో బీజేపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తున్నట్టు ఏపీలో జరుగుతుందనుకున్నారా..? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాల గురించి ఇటీవల బండి సంజయ్ ప్రశ్నించారు. అందుకే ఈ ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాద్యతల్లో ఉన్నారు. ఆయనపై ఇలా ఘోరంగా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతలు, మాజీ మంత్రులపై బీజేపీ ఎలా ఎదురుదాడి చేస్తుందో చూడాల్సి లఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close