“దస్తగిరి”పై పోలీసు కేసు !

వైఎస్ వివేకా కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపైనే కాదు.. అప్రూవర్‌గా మారిన దస్తగిరిపైనా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్‌లోనే ఓ వ్యక్తిపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. తొండూరు పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. పోలీస్ స్టేషన్‌లోనే దాడి జరిగిందని చెప్పారు కాబట్టి పోలీసులే దీనికి సాక్షులన్నమాట.

దస్తగిరికి మస్తాన్ అనే సోదరుడు ఉన్నారు. ఆయనకు పెద్ద గోపాల్ అనే వ్యక్తికి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో గోపాల్ తొండూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు మస్తాన్‌ను పిలిపించారు. అయితే మస్తాన్ తర్వాత తన సోదరుడ్ని కూడా తనను ఇలా పోలీసులు తీసుకెళ్లారని చెప్పడంతో ఆయన కూడా స్టేషన్‌కు వెళ్లారు. అయితే స్టేషన్‌లో మాట మాట పెరిగి తనపై దస్తగిరి దాడి చేశాడని గోపాల్ అక్కడే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంటే పోలీస్ స్టేషన్‌లోనే పోలీసులు ఉండగానే దాడి చేశారని.. గోపాల్ ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కేసు పెట్టారన్నమాట.

ఇప్పటికే వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనకు ప్రాణభయం ఉందని.. అదే పనిగా మొరపెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు అధికారుల్నే బెదిరిస్తున్నారని.. ఇక అప్రూవర్‌గా మారిన వారిని బెదిరించడం ఎంత పని అన్న చర్చ నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మొదటి నుంచి పోలీసుల తీరు వివాదాస్పదం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close