సుభాష్ : ఎక్కడ తగ్గాలో తెలిసిన పవన్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలిగి.. బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్న నిర్ణయం విమర్శలకు కారణం అయింది. అయితే.. కాస్త విశాలంగా… పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ వైపు నుంచి ఆలోచిస్తే… తన అత్తారింటికి దారేది సినిమాలోని డైలాగ్‌ను గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసుకుంటేనే ఏదైనా సాధించగలరు. పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పటికిప్పుడు విమర్శలు రావొచ్చు కానీ.. కొన్నాళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.,.. ఆయన ఎందుకు తగ్గారో.. దానికి ఎంత రాజకీయ ప్రయోజనం పొందారో స్పష్టంగా తెలిసిపోతుంది.

బీజేపీకి తన అవసరం ఏమిటో చూపించిన పవన్..!

గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయడం అనేది మామూలుగా అయితే ఎవరూ పట్టించుకోకుండా వదిలేసే అంశం. ఒకప్పుడు.. మేయర్ సీటు ఏలిన టీడీపీ… గత బల్దియా ఎన్నికల్లో కనీసం 70 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ పోటీనే ఇప్పుడు అక్కడ నామమాత్రం అయింది. అలాంటప్పుడు.. సినీ ఫ్యాన్స్‌ను మాత్రమే నమ్ముకుని బరిలోకి దిగాలని పవన్ కల్యాణ్ కూడా అనుకుని ఉండరు. కానీ…పోటీ చేస్తానని ప్రకటన చేశారు. అభ్యర్థుల్ని కూడా ఖరారు చేశారు. ఎందుకంటే.., బీజేపీకి తానెంత కీలకమో చెప్పాలనుకున్నారు. తను లెక్కలేనట్లు వ్యవహరిస్తున్న వారికి తన విలువేంటో చెప్పాలనుకున్నారు. అందుకే పోటీ ప్రకటన చేశారు. కార్యకర్తల్ని సిద్ధం చేశారు. నిజంగా పవన్ కల్యాణ్.. తాను అనుకున్న ఎఫెక్ట్ తీసుకు వచ్చారు. దెబ్బకి బీజేపీ దిగి వచ్చింది.

రాబోయే బీజేపీ గెలుపులో పవన్‌కూ క్రెడిట్..!

గ్రేటర్‌లో పవన్ పోటీ చేసినా.. ఒక్క కార్పొరేటర్ సీటు అయినా వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు.. ఆ పార్టీ తరపున గ్రేటర్‌లో పోటీ చేసినప్పుడు.. ఒక్కరంటే… ఒక్క కార్పొరేటర్ గెలిచారు. అప్పుడు టీడీపీ 45, కాంగ్రెస్ 50కిపైకా కార్పొరేటర్ సీట్లను గెలిచింది. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీఆర్ఎస్ సాహసించలేకపోయింది. పీఆర్పీకే ఒక్క సీటు వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ కు… డిపాజిట్లు వస్తాయన్న గ్యారంటీ ఉండదు. పోటీ చేస్తే.. పవన్ బలం అంతేనా అన్న విశ్లేషణలు వస్తాయి. ఇప్పుడు బీజేపీకి గ్రేటర్‌లో పాజిటివ్ మూడ్ ఉంది. పోటీ చేయకుండా మద్దతివ్వడం వల్ల.. బీజేపీ సాధించే ఫలితాల్లో ఎంతో కొంత క్రెడిట్ దక్కుంది. అందులో సందేహం లేదు.

ఏపీ రాజకీయంలో బీజేపీపై అడ్వాంటేజ్..!

అంతకు మించి పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో తగ్గడం వల్ల ఏపీలో అడ్వాంటేజ్ సాధించారు. తెలంగాణలో ఆ పార్టీ ఎదుగుదల కోసం.. చేసిన త్యాగాన్ని బీజేపీ ఏపీలో గుర్తించాల్సి ఉంటుంది. బీజేపీ హైకమాండ్ కూడా.. పవన్ కల్యాణ్.. తమ పార్టీ కోసం చేసిన త్యాగాల్ని గుర్తించక తప్పదు. లేకపోతే.. పవన్ కల్యాణ్‌ను వాడేసుకుని వదిలేశారన్న అభిప్రాయం.. ఆయన ఫ్యాన్స్‌లో ఏర్పడుతుంది. అదే జరిగితే.. మొదటగా నష్టపోయేది జనసేన కాదు.. బీజేపీనే. అందుకే.. ఏ విధంగా చూసినా… గ్రేటర్ ఎన్నికల బరి నుంచి తగ్గాలనే విషయంలోనే పవన్ కల్యాణ్ నిర్ణయం.. ఆయనకు దీర్ఘ కాలంలో లాభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close