భక్తి బంధాలు!

రాజకీయ నేతలు రోజూ ఎంతగా విమర్శించుకుని వివాదపడినా భక్తి విషయాల్లో ఎక్కడ లేనంత దగ్గరగా సంచరిస్తారు. మొన్న చండీయాగం సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేశంలోని చాలామందిని ఆహ్వానించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చి వెళ్లారు. ఇప్పుడు కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు కుటుంబం వంతు వచ్చింది. హైదరాబాదు ఎన్టీఆర్‌ స్టేడియంలో గతం నుంచీ వేంకటేశ్వర వైభవం నిర్వహిస్తున్న ఆయన కుమారుడు ముప్పవరపు హర్ష మిత్రబృందం అందరినీ ఆహ్వానించి తిరుపతిలో జరిగే కైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహించే ఏర్పాటు చేసింది. మొదటి రోజు వెంకయ్య నాయుడు కెసిఆర్‌ పాల్గొనగా మధ్యలో మరికొందరు నేతలు ఆఖరి రోజున మళ్లీ వెంకయ్య చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల వేడి నుంచి బయిటపడి భక్తి రాజ్యంలో రాజకీయ నేతలు కలుసుకోవడానికి ఇది వేదిక అవుతున్నది. విశాఖలో టి.సుబ్బరామిరెడ్డి మొదటి నుంచి ఈ పంధాను జయప్రదంగా అమలు చేస్తుంటారు. నిజానికి వెంకయ్యనాయుడు వంటి వారి కంటే కెసిఆరే ఈ విషయంలో ముందున్నారు. రాష్ట్రపతి గవర్నర్‌తో సహా ప్రతివారికి పాదాభివందనం చేయడం, స్వాములను ఎక్కడివారైనా సరే ఆహ్వానించి ప్రణమిల్లడం, గోబ్రాహ్మణేభ్య సుఖినోభవంతు తరహాలో పరవశించడం ఆయనకు ఆమోదం పెంచుతున్నాయని ఆ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా భవబంధాలకు భక్తిబంధాలకు పోటీ వుండకూడదనే భావాన్ని మన నాయకులంతా పాటించడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ సర్కార్ కు టైం ఫిక్స్ చేసిన బీజేపీ..!?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా..? కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం పీఠం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుందా..?అంటే వరుసగా...

వైసీపీ సోషల్ మీడియా సైలెన్స్ – ఐ ప్యాక్‌ను వదిలించుకున్నారా ?

వైసీపీ సోషల్ మీడియా ఒక్క సారిగా మూగబోయింది. మామూుగా అయితే ఈ పాటికి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తో హడలెత్తించాలి. కానీ పోలింగ్ రోజు మధ్యాహ్నానికి చేసిన ఫేక్ సర్వే వీడియోల...

వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్న వైసీపీ నేతలు

వైసీపీ నేతలు వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్నారు. నిరాశ నిండిన మొహాలతో ఈసీపై పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. పల్నాడులో తమ ప్లాన్ పారకపోవడంతో నేతలు నిరాశకు గురయ్యారు. ఈ రోజు...

జనసేన స్ట్రైక్ రేట్ ఎనభై శాతం ఉంటుందా?

జనసేన పార్టీ గత ఎన్నికల్లో చదవి చూసిన ఘోర పరాజయాన్ని మరిపించేలా ఈ సారి ఎన్నికల పలితాలు ఉంటాయని పోలింగ్ సరళి తర్వాత నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. మొత్తం ఇరవై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close