ట్యాపింగ్ కేసులో అప్రూవర్‌గా ప్రభాకర్ రావు !

తెలంగాణలో ట్యాపింగ్ కేసు సంచలన మలుపు తిరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రభాకర్ రావు లేదా మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ అప్రూవర్ గా మారి సంచనాత్మక విషయాలు బయటపెట్టబోతున్నట్లుగా చెబుతున్నారు. తన మెడకే కేసు చుట్టుకోవడంతో ప్రభాకరరావు తీవ్రంగా ఆందోళన చెదుతున్నారు. ఆయన పోలీసు శాఖలోని తన సన్నిహితులతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో తన రాజకీయ బాసులు చెబితేనే చేశానని అంగీకరించి.. జరిగిదంందా చెబితే.. అప్రూవర్ గా మార్చి బయటపడేస్తామన్న ఆఫర్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఆయన కన్విన్స్ కావడంతో ఇండియాకు తిరిగి వస్తున్నట్లుగా తెలుస్తోంది.

ట్యాపింగ్ కేసు అత్యంత కఠిమైనది, ట్యాపింగ్ చేసినట్లుగా పక్కా ఆధారాలు ఉండటంతో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు పెడుతున్నారు. అయితే పోలీసులు ఈ ఒక్క అంశంపై దృష్టి పెట్టడం లేదు. ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంలో ఓ మాఫియా మాదిరిగా వ్యాపారుల్ని దోచుకున్న వైనాన్ని బయటపెట్టాలనుకుంటున్నారు. అలాగే ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో డబ్బు తరలింపు అంశాన్ని బయట పెట్టాలనుకుంటున్నారు. ఈ వివరాలన్నీ పోలీసుల వద్ద ఉన్నాయి. అందుకే ప్రభాకర్ రావు.. అమెరికా నుంచి వచ్చి పోలీసుల ఎదుటలొంగిపోవాలని నిర్ణయించుకున్టన్లుగా తెలుస్తోంది.

ప్రభాకర్ రావు లేదా మరో కీలక నిందితుడు అప్రూవర్ గా మారితే.. ఇక రాజకీయ నేతలకూ నోటీసులు వెళ్లడం కామన్ గా మారుతుంది. ఇద్దరు మాజీ మంత్రులు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని చెబుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కేటీఆర్ పేరు తరచూ ప్రస్తావనకు వస్తోంది. ప్రభాకర్ రావును అరెస్టు చూపించిన తర్వాత ఈ ఇద్దరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close