నాగ్‌తో ప్రియ‌మ‌ణి?

‘ర‌గ‌డ‌’ సినిమాలో నాగార్జున‌, ప్రియ‌మ‌ణి జంట‌గా క‌నిపించారు. 2010లో విడుద‌లైన సినిమా ఇది. ఆ త‌ర‌వాత నాగ్, ప్రియ‌మ‌ణి క‌లిసి న‌టించ‌లేదు. ఇప్పుడు 14 ఏళ్ల త‌ర‌వాత ఈ జోడీని తెర‌పై చూసే అవ‌కాశం ద‌క్క‌బోతోంది. నాగార్జున క‌థానాయ‌కుడిగా సుబ్బు అనే ఓ కొత్త ద‌ర్శ‌కుడితో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఇదో కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో నాగ్ లాయ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఆయ‌నకు జోడీగా ప్రియ‌మ‌ణి క‌నిపించ‌బోతోంది. ప్రియ‌మ‌ణి క్యారెక్ట‌ర్ రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర‌ల‌కు చాలా భిన్నంగా ఉండ‌బోతోంద‌ని, ఓ సీరియ‌స్ ట‌చ్‌తో సాగ‌బోతోంద‌ని స‌మాచారం. వెట‌ర‌న్ హీరోయినే ఈ పాత్ర‌కు న్యాయం చేస్తుంద‌న్న ఉద్దేశంతో ప్రియ‌మ‌ణిని ఎంచుకొన్నార‌ని తెలుస్తోంది. ‘జై భీమ్‌’, ‘నెరు’, ‘నాంది’ ఫార్ములాలో సీరియ‌స్‌గా సాగే కోర్ట్ రూమ్ డ్రామా ఇది. ఓ బ‌ల‌మైన‌ సామాజిక అంశాన్ని ఈ క‌థ‌లో ప్ర‌స్తావించ‌బోతున్నార్ట‌. `నా సామిరంగ`తో ఈ సంక్రాంతి హిట్టు కొట్టిన నాగ్.. అదే ఉత్సాహంలో ఈ సినిమాకీ త్వ‌ర‌లోనే కొబ్బ‌రికాయ కొట్ట‌బోతున్నాడు. మ‌రోవైపు ధ‌నుష్, శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో డాన్‌గా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్న వైసీపీ నేతలు

వైసీపీ నేతలు వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్నారు. నిరాశ నిండిన మొహాలతో ఈసీపై పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. పల్నాడులో తమ ప్లాన్ పారకపోవడంతో నేతలు నిరాశకు గురయ్యారు. ఈ రోజు...

జనసేన స్ట్రైక్ రేట్ ఎనభై శాతం ఉంటుందా?

జనసేన పార్టీ గత ఎన్నికల్లో చదవి చూసిన ఘోర పరాజయాన్ని మరిపించేలా ఈ సారి ఎన్నికల పలితాలు ఉంటాయని పోలింగ్ సరళి తర్వాత నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. మొత్తం ఇరవై...

భారత్ కు అమెరికా వార్నింగ్ ..!!

ఇరాన్ తో చాబహార్ పోర్టుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడంపై ఇండియాకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ తో ఏ సంస్థ అయినా, దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే ఆంక్షలు విధిస్తామని...

తెరపైకి క్రికెటర్ క్యారెక్టరైజేషన్

ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ గుర్తున్నాడా? మెరుపు వేగంతో బంతులు వేసే బాలాజీ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. ఆయన సీరియస్ గా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపుగా ఆయన స్మైల్ ఫేస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close