మద్యం షాపుల ముందు 5 కాదు.. 500 మంది..!

ఆంద్రప్రదేశ్‌లో 40 రోజుల తర్వాత మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించడంతో… ఆ రాష్ట్రానికి మొత్తానికి ఎప్పుడూ లేనంత కళ వచ్చేసింది. ఉదయం నుంచే ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. సాధారణంగానిత్యావసర వస్తువులకు మాత్రమే ఇటీవలి కాలంలో బయటకు వస్తున్నారు. ఇప్పుడు మద్యం అంత కంటే ముఖ్యమైనదిగా భావిస్తున్నారేమో కానీ.. ప్రతీ ఒక్క షాపు ముందు .. తెరవక ముందే కిలోమీటర్ల మేర క్యూ ఏర్పడిపోయింది. ఉదయం పదకొండు గంటలకు అధికారికంగా మద్యం దుకాణాలు తెరుస్తారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి క్యూ ప్రారంభమయింది. చాలా చోట్ల అది మూడు, నాలుగు కిలోమీటర్లు కూడా ఉంది. కొన్ని చోట్ల మాత్రమే.. భౌతిక దూరం నిబంధనలు పాటించారు. ఇంకెక్కడా వాటి గురించి పట్టించుకోలేదు.

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. దుకాణం వల్ల.. ఐదుగురు అంటే.. ఐదుగురు మాత్రమే ఉండాలి. ఎక్కవ మంది ఉంటే.. దుకాణాలు మూసివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా.. అవే మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం..భౌతిక దూరం పాటించి..ఐదుగురు మాత్రమే ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై పడింది. కానీ పోలీసులు వచ్చిన వారందర్నీ.. క్యూలో నిలబెట్టడానికే తంటాలు పడ్డారు. ఎవరనీ.. షాపు వద్ద నుంచి వెళ్లిపోవాలని కోరలేదు. చాలా చోట్ల సోషల్ డిస్టెన్స్ కూడాపాటించలేదు. మెజార్టీ మందుబాబులకు మాస్కులు కూడా లేవు. మద్యం కొనుగోలుదారులకు ప్రత్యేకంగా పర్మిషన్ ఉన్నట్లుగా పోలీసులు వారందర్నీ చూసీ చూడనట్లుగా వ్యవహరించారు.

ప్రభుత్వం తీరుపై.. విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది మద్యం కాదని… కరోనా వ్యాప్తి చెందితే.. ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నాయి. అయితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే.. తాము మద్యం దుకాణాలు ప్రారంభించామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దుకాణాల్లో ఉన్న సరుకు.. నలభై రోజుల నుంచి మందుబాబులు కరువుతో ఉండటంతో.. త్వరగా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే.. రెండు రోజుల ముందే.. ఏపీ డిస్టిలరీల్లో ఉత్పత్తికి సర్కార్ అనుమతి ఇచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫైనల్ లెక్క : పోస్టల్ బ్యాలెట్లు 5 లక్షల 40 వేలు !

పోస్టల్ బ్యాలెట్ల ఫైనల్ లెక్క తేలింది. మొత్తం జిల్లాల వారీగా వచ్చిన లెక్కలను చూస్తే 5,39,189 ఓట్లుగా గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ల గడువు పూర్తియన తర్వాత చెప్పిన దాని కంటే దాదాపుగా...

శ‌ర్వానంద్.. అంత టైమ్ లేద‌మ్మా!!

శ‌ర్వానంద్ కొత్త సినిమా 'మ‌న‌మే' రిలీజ్ డేట్ ఖాయ‌మైంది. జూన్ 7న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అంటే మ‌రో 15 రోజుల టైమ్ ఉంద‌న్న‌మాట‌. నిజానికి ఓ...

ఎక్స్‌క్లూజీవ్‌: ‘ఫిదా’ కాంబో మ‌ళ్లీ!

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా 'ఫిదా'. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ గా నిలిచిపోయింది. ఇప్పుడు వ‌రుణ్‌తేజ్‌, శేఖ‌ర్ క‌మ్ముల మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. ఏ...

అసెంబ్లీకి డుమ్మా…కేసీఆర్ దారిలోనే జగన్ రెడ్డి..?

ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోతే జగన్ పరిస్థితి ఏంటి..? అధికారం కోల్పోవడాన్ని అవమానంగా ఫీలయ్యే జగన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా..? లేక కేసీఆర్ తరహాలోనే డుమ్మా కొడుతారా..? ఇప్పుడిదే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close