కాంగ్రెస్‌ “న్యాయ్‌”తో బీజేపీ అన్యాయమైపోతోందా..?

పేదలకు ఏడాదికి రూ. 72వేలు ఇస్తామంటూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన “న్యాయ్” పథకం ఉత్తరాది ఓటర్లపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఎన్నికల విశ్లేషణలు మొత్తం కులాలు, మతాల ప్రకారం చేస్తున్నారు కానీ… “న్యాయ్” పథకం ప్రభావాన్ని అంచనా వేయడంలో విఫలమవుతున్నారనే విశ్లేషణ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. దక్షిణాదిలో “న్యాయ్” పథకంపై పెద్ద చర్చ… రచ్చ జరగలేదు కానీ.. ఉత్తరాదిలో మాత్రం.. ఇదో హాట్ టాపిక్ అయింది. నాలుగు దశల ఎన్నికల తర్వాత.. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే..”న్యాయ్” పథకంతో.. బీజేపీ అన్యాయమైపోయే సూచనలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం… చాలా ఎక్కువ మందిలో ఏర్పడుతోంది.

పైగా… 2014లో రంగుల ప్రపంచం చూపించిన మోడీ.. 2019కి వచ్చే సరికి చౌకీదార్‌ని అంటున్నారు.. కానీ.. ఐదేళ్లలో ఏం చేశారో మాత్రం చెప్పడం లేదు. నోట్ల రద్దుతో ఒక పక్క, జీఎస్టీతో మరో పక్క జనం నడ్డి విరిచారు. మోదీని ఎన్నుకుని ఇబ్బంది పడ్డామన్న భావన జనంలో బాగా పెరిగిపోయింది. ఐదేళ్లలో మోదీ పరపతి మైనస్సుల్లోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలాంటి భావోద్వేగాలను నమ్ముకోలేదు. తొలి నుంచి ప్రజల్లో తమకున్న పరపతినే ఓట్లుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. యూపీఎ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, 2019లో మళ్లీ ఆధికారానికి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల ఆధారంగానే విజయం సాధించేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేసుకుంటోంది. గతంలో యూపీఏ రుణమాఫీ లాంటిపథకాలను పకడ్బందీగా అమలు చేసింది. అందుకే ఇప్పుడు ప్రతీ పేద వాడి ఖాతాలోకి ఎటా 72 వేల రూపాయలు వేస్తామన్న హామీ ప్రజల్లో పలుకుబడి సాధించింది. ఇదే తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. రాహుల్ నోట ఆ హామీ వచ్చిన తర్వాత బీజేపీ వర్గాల్లో టెన్షన్ పెరిగిందనే చెప్పారు.

ఏదో ఓ భావోద్వేగ పరిస్థితులు లేకపోతే.. బీజేపీ గెలవడం అసాధ్యమనే అంచనాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. అందుకే… పాకిస్తాన్ గురించి పదే పదే చెబుతూ… మోడీ.. భావోద్వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో భావోద్వేగాలు పనిచేయడం లేదు. భావోద్వేగాలను సృష్టించి తనకు అనుకూలంగా మార్చుకోవాలని మోదీ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. పుల్వామా ఉగ్రదాడిని చూపించి జనంలో సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలనుకున్న మోదీ ప్రయత్నానికి జనం నుంచి స్పందన లేదు. పాకిస్థాన్ ను బూచిగా చూపించి ఏదో సాధిద్దామనుకుంటే ఫలితం దక్కలేదు. ఇప్పుడు.. బీజేపీ ‌అన్యాయం అయిపోతోందనే అభిప్రాయం బలపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close