రాజ‌శేఖ‌ర్ ‘స‌త్తా’ చూపిస్తాడ‌ట‌

ప్ర‌వీణ్ స‌త్తారు.. వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌తో ప్ర‌యాణం సాగిస్తున్న ద‌ర్శ‌కుడు. చందమామ‌క‌థ‌లు సినిమాకి జాతీయ అవార్డు కూడా ద‌క్కింది. ఆ వెంట‌నే గుంటూర్ టాకీస్ అంటూ ఓ మాస్ సినిమా తీసి.. అంద‌ర్నీ షాక్‌కి గురిచేశాడు. ఇప్పుడు మ‌రోసారి షాక్ ఇవ్వ‌డానికి రెడీ అయ్యాడు. ప్ర‌వీణ్ స‌త్తారు.. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ కోసం ఓ క‌థ సిద్ధం చేసుకొన్నాడ‌ట‌. ఈ క‌థ‌ని రాజ‌శేఖ‌ర్‌కి వినిపించ‌డం, ఆయ‌న ఓకే అనేయ‌డం జ‌రిగిపోయాయ‌ట‌. ఇందులో రాజ‌శేఖ‌ర్ ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.

అస‌లే రాజ‌శేఖ‌ర్‌ని జ‌నాలు మ‌ర్చిపోతున్నారు. ఈ ద‌శ‌లో ప్ర‌వీణ్‌కి రాజ‌శేఖ‌ర్‌తో సినిమా చేయాల‌ని ఎందుకు అనిపించింది? అని అడిగితే ”నేను రాసుకొన్న పోలీస్ పాత్ర‌లో రాజ‌శేఖ‌ర్ త‌ప్ప ఇంకెవ్వ‌రూ యాప్ట్ అవ్వ‌రు” అంటున్నాడు. సినిమాల కోసం అవ‌కాశాల కోసం రాజ‌శేఖ‌ర్ క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నాడు. కొన్ని అవ‌కాశాలు అందిన‌ట్టే అంది చేజారిపోతున్నాయి. దర్శ‌కుడు శ్రీ‌వాస్… రాజ‌శేఖ‌ర్‌ని విల‌న్‌గా చూపించ‌డానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు ప్ర‌వీణ్ సత్తార్‌.. రాజ‌శేఖ‌ర్‌లో హీరోని ఇంకా చూస్తూనే ఉన్నాడు. రాజ‌శేఖ‌ర్‌కి మంచి రోజులు మొద‌లైన‌ట్టే అనిపిస్తోంది మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

వైసీపీ ఘోర పరాజయం ఖాయం – జగన్‌కు ఎప్పుడో చెప్పా : ప్రశాంత్ కిషోర్

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను మరోసారి చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం ఖాయమని అన్నారు. ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్ కు చెప్పానని స్పష్టం చేశారు. ఆర్టీవీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close