ఐఫా మెరుపులు : కొత్త బిరుదు సృష్టించిన భ‌ళ్లాల‌దేవ‌

ప్ర‌తీ హీరో వ‌స్తూ వ‌స్తూనే ఓ బిరుదు త‌గిలించుకొని వ‌చ్చేస్తున్నాడు. ఒక్క సినిమా కూడా చేయ‌కుండా సంపూర్ణేష్ బాబు బ‌ర్నింగ్ స్టార్ అనిపించుకోలేదూ… అలా! ఈ బిరుదుల ప‌ర్వంపై ఐఫాలో సెటైర్లు మీద సెటైర్లు వేసేశారు వ్యాఖ్యాత‌లు రానా, నాని. `మేం సెటైర్లు వేయ‌డానికే వ‌స్తున్నాం.. కాచుకోండి` అని ముందే హింటిచ్చిన ఈ హీరోలిద్ద‌రూ.. చెప్పిన మాట చెప్పిన‌ట్టు చెసేశారు. మ‌రీ ముఖ్యంగా యంగ్ హీరోల‌పై సెటైర్లు, పంచ్‌లు తెగ విసిరేశారు. `సుప్రీమ్‌` సినిమా చేశాడు కాబ‌ట్టి సాయిధ‌ర‌మ్ తేజ్‌ని `సుప్రీమ్ హీరో`అని పిల‌వాల్సివ‌స్తోంద‌ని… ఆ బిరుదు ఎవ్వ‌రూ ఇవ్వ‌లేద‌ని పంచ్‌లేశారు. పెళ్లి చూపులు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌నైతే ఓ ఆట ఆడుకొన్నారు. రెండో సినిమాకే క‌టౌట్లు త‌గిలించుకొని వ‌చ్చాడ‌ని.. క‌టౌట్ స్టార్ అన్నారు. ఆ త‌ర‌వాత రానా కొత్త బిరుదు సృష్టించాడు. `స‌ర్‌ప్రైజ్ స్టార్` అంటూ విజ‌య్‌కి బిరుదు అంకితం చేశాడు. `అవును… వీడు హీరో అవ్వ‌డం నాకు స‌ర్‌ప్రైజే` అంటూ నాని కౌంట‌రేశాడు. విజ‌య్ వేసుకొచ్చిన కోటు గురించి కూడా నాని ఎట‌కారంగానే మాట్లాడాడు.

అంతేకాదు… సుచీ లీక్స్‌పైనా కొన్ని జోకులు పేలాయి. `నాన్ బాహుబ‌లి రికార్డుల` ప్ర‌స్తావ‌న ఐఫా వేడుక‌ల‌పై తీసుకొచ్చారు వీరిద్ద‌రూ. నెంబర్ వ‌న్‌ని ఎలాగూ కొట్టలేని సినిమాలు `నాన్ బాహుబ‌లి రికార్డ్‌` అంటూ నెం.2తో సంతృప్తి ప‌డుతున్నాయ‌ని, దాన్నే నెం.1 అనుకొంటున్నాయ‌ని ఈమ‌ధ్య రికార్డులు సృష్టించిన సినిమాల‌కు చుర‌క‌లు అంటించారు. రానా, నాని ఇద్ద‌రూ కార్య‌క్ర‌మాన్ని కాస్త ఆహ్లాద‌క‌రంగానే న‌డిపించ‌డానికి ప్ర‌య‌త్నించారు. వీరిద్ద‌రి యాంక‌రింగ్ వ‌ల్లే… ఐఫాకి కాస్త జోష్ వ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close