రానాతో త‌రుణ్ భాస్క‌ర్‌

మాస్ట‌ర్ మైండ్ అంటే సురేష్ బాబుదే. ఓ ప్రాజెక్ట్ సెట్ చేశాడంటే.. అందులో మినిమం గ్యారెంటీ ఉంటుంది. పైసా రాబ‌డి లేనిదే ఒక్క స్టెప్పు కూడా వేయ‌డు. ఓ విధంగా వ్యాపార వేత్త‌కు ఉండే స‌గ‌టు క్వాలిటీ అదే. సురేష్ బాబు దృష్టిలో ఎవ‌రైనా ప‌డ్డారంటే… వాళ్ల కెరీర్ మొత్తం రామానాయుడు స్టూడియోకి అంకితం అయిపోవాల్సిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ఫోక‌స్ త‌రుణ్ భాస్క‌ర్‌పై ప‌డింది. పెళ్లి చూపులు, ఈ న‌గ‌రానికి ఏమైంది? రెండూ సురేష్ ప్రొడ‌క్ష‌న్ నుంచి వ‌చ్చిన‌వే. ముచ్చ‌ట‌గా మూడో సినిమా కూడా ఈ సంస్థ‌లోనే చేయ‌బోతున్నాడు త‌రుణ్‌. ఈసారి.. రానాతో త‌రుణ్ జోడీ కుదిరింది. ఈ న‌గ‌రానికి ఏమైంది త‌ర‌వాత రానాతో త‌రుణ్ సినిమా ఉండొచ్చు. సురేష్ బాబు త‌న మ‌రో త‌న‌యుడు అభిరామ్‌తో ఓ సినిమా చేద్దామ‌ని అప్పుడెప్పుడో ఫిక్స్ అయ్యాడు. పెళ్లి చూపులు త‌ర‌వాత‌… త‌రుణ్ అభిరామ్‌తోనే సినిమా చేయాల్సింది. కానీ కుద‌ర్లేదు. రానాతో సినిమా లేట‌వుతుంద‌నుకుంటే.. త‌రుణ్ కోసం మ‌రో హీరోని రంగంలోకి దింప‌డానికి కూడా సురేష్ బాబు రెడీగానే ఉన్నాడ‌ట‌. అయితే త‌రుణ్ మాత్రం మూడో సినిమాకి ఇంకాస్త స‌మ‌యం కావాల‌ని, రానా వ‌చ్చే వ‌ర‌కూ ఎదురు చూస్తాన‌ని చెబుతున్నాడ‌ట‌. సో.. త‌రుణ్ మూడో సినిమా కూడా… ఇక సురేష్ బాబు చేతుల్లోకి వెళ్లిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close