విమ‌ర్శ‌ల్ని ప‌ట్టించుకోను : రంజిత్‌

క‌బాలికి ముందు రంజిత్ అంటే ఓ సంచ‌ల‌నం. అంత చిన్న వ‌య‌సులో, రెండు సినిమాల అనుభ‌వంతో సూప‌ర్ స్టార్ సినిమాకి డైరెక్ట్ చేసే అవ‌కాశం ఎలా ద‌క్కించుకొన్నాడూ..??? అంటూ రంజిత్‌ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు, ఈర్ష్య ప‌డ్డారు. క‌బాలి విడుద‌లైన రోజే.. ఈ సీన్ రివ‌ర్స్ అయ్యింది. కబాలి ఫ్లాప్‌కి రంజితే కార‌ణం అంటూ ర‌జ‌నీ ఫ్యాన్స్ సైతం ఆవేశంతో ఊగిపోతున్నారు. సూప‌ర్ స్టార్‌ని డీల్ చేయ‌లేక‌పోయాడు అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వీటిపై రంజిత్ కూడా స్పందించాడు. ”ఈ సినిమాపై వ‌చ్చిన పొగ‌డ్త‌లు, విమ‌ర్శ‌లు గ‌మ‌నించాను. రెంటింటినీ నేను ప‌ట్టించుకోను. నేను ఏం అనుకొన్నానో అది తెర‌పై చూపించ‌గ‌లిగాను. ర‌జ‌నీ సార్ కూడా మెచ్చుకొన్నారు” అంటున్నాడీ కుర్ర డైరెక్ట‌ర్‌.

ర‌జ‌నీ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాల‌ని ఈ సినిమా తీయ‌లేద‌ట‌. ఓ కొత్త ర‌జ‌నీని చూపించాల‌ని ప్ర‌య‌త్నించాడ‌ట‌. రియ‌లిస్టిక్ సినిమాలు తీయ‌డంలో ఉన్న మ‌జానే వేర‌ని.. తాను కూడా అదే చేశాన‌ని, ర‌జ‌నీలోని స్టార్ కంటే ర‌జ‌నీలోని న‌టుడ్ని బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నించాన‌ని చెప్పుకొచ్చాడు రంజిత్‌. అయితే ఈ వివ‌ర‌ణ‌తో ర‌జ‌నీ ఫ్యాన్స్‌ సంతృప్తి ప‌డ‌డం లేదు. ఈ సినిమా కంటే లింగ‌నే బెట‌ర్‌.. అంటూ కౌంట‌ర్లు విసురుతున్నారు. లింగ‌కి సోద‌రుడు వ‌చ్చాడంటూ క‌బాలికిని వ‌ర్ణిస్తున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close