చైతన్య : రాయలసీమలో అడ్వాంటేజ్ టీడీపీ..!

రాయలసీమలో రాజకీయం మారుతోంది. గత ఎన్నికల్లో.. కడప, కర్నూలు జిల్లాల్లో ఏకపక్ష విజయాలు సాధించిన వైసీపీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. బలమైన నేతలు పార్టీని వీడిపోవడం… వరుస పరాజయాలు.. ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. పార్టీ నుంచి వలసలు ఒక్కటే కాదు.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు.. రాయలసీమలో టీడీపీకి ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. వైసీపీ నుంచే కాదు.. ఏ పార్టీ నుంచి అయినా.. ముందుగా టీడీపీలో చేరాలని చూస్తున్న వాళ్లే ఎక్కువ.

కడపలో టీడీపీ పైచేయి ఖాయమేనా..?

కడప జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఉన్న పది నియోజకవర్గాల్లో 9 చోట్ల విజయం సాధించింది. మరి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందా..? అంటే.. వైసీపీ నేతలు కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితి. ఆదినారాయణరెడ్డి పార్టీ మారిన తర్వాత.. కడపలో పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. ఓ రకంగా టీడీపీదే పై చేయిగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి కూడా పరాజయం వైసీపీకి ఓ రకంగా భారీ షాక్. పతనం ప్రారంభమయిందనే అంచనాలు అప్పట్నుంచే ప్రారంభమయ్యాయి. పార్టీ నేతల మధ్య ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలు ఉన్నాయి. జగన్ కుటుంబ సభ్యుల్లోనూ.. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి వచ్చింది. ఆర్థిక కారణాలతో సోదరుని ఇంటి ముందు… వివేకానందరెడ్డి ధర్నా చేయడం ఈ విబేధాల తీవ్రత ఎలా ఉందో స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా గండికోట ప్రాజెక్ట్ పూర్తి చేసి.. పులివెందుల సహా చుట్టుపక్కల నియోజకవర్గాలన్నింటికీ నీరిచ్చారు. తీవ్ర వర్షాభావం ఉన్నా.. చినీచెట్లు, హర్టికల్చర్ బాగుపడేలా చేశారు. ఫలితంగా ప్రజల్లో సానుకూల దృక్పథం కనిపిస్తోంది. అదే సమయంలో.. కడప ఉక్కు పరిశ్రమను సొంతంగా పెట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం .. టీడీపీకి ప్లస్ పాయింట్ గా మారింది. అదే సమయంలో సెంటిమెంట్ గా మారిన ఉక్కు పరిశ్రమ కోసం గొంతెత్తలేకపోయారు.

“కోట్ల బలం.. నంద్యాల ఎఫెక్ట్” వైసీపీని ఏం చేయబోతున్నాయి..?

వైసీపీకి ఏకపక్షంగా మద్దతు పలికిన మరో జిల్లా కర్నూలు. ఆ జిల్లాలో ఉన్న పధ్నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ పదకొండు స్థానాల్లో గెలిచింది. టీడీపీ కేవలం మూడింటితోనే సరి పెట్టుకుంది. ఆ తర్వాత పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. ఆ వలసలు అలా సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కోట్ల కుటుంబం కూడా.. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకుంది. నంద్యాల గెలుపు తర్వాత సెంటిమెంట్ మారిపోయింది. మరోవైపు కర్నూలు అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్ర విద్యాసంస్థలు, తంగడంచలో సీడ్ పార్క్, ఓర్వకల్లు దగ్గర విమానాశ్రయం, విదేశీ పెట్టుబడులు.. కర్నూలుకు వచ్చాయి. అన్నింటికి మించి.. వీలైనంతగా నీటి కొరత లేకుండా చేశారు. ఫలితంగా.. రైతుల్లో ఎప్పుడూ లేనంత సానుకూలత కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ గత ఎన్నికల్లో… టీడీపీతో పోటాపోటీ ఫలితాలను సాధించింది. పెద్ద ఎత్తున పరిశ్రమలను చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చి ప్రభుత్వం … ప్రజల్లో ముఖ్యంగా యువతలో.. ఓ క్రేజ్ తెచ్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు.. తమ తయారీ సంస్థలను.. తిరుపతిలో పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్తూరులో పారిశ్రామీకరకరణ జరుగుతోంది. అదే సమయంలో.. నీటి సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేశారు.దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న హంద్రీనీవా నీరు చిత్తూరు జిల్లాను తాకింది. కృష్ణా నీరు జిల్లాకు అందడంతో.. రైతులతో పాటు సామాన్య ప్రజల్లోనూ పాజిటివ్ వేవ్ ప్రారంభమయింది.

అనంతపురం వైసీపీని జగన్ రాజకీయం నిర్వీర్యం చేసిందా..?

రాయలసీమలో.. వైసీపీ పూర్తిగా చతికిలపడిన జిల్లా అనంతపురం. పధ్నాలుగు నియోజకవర్గాల్లో … రెండు చోట్లనే గత ఎన్నికల్లో విజయం సాధించారు. స్వల్ప మెజార్టీతో కదిరి, ఉరవకొండ నియోజకవర్గాల్లో బయటపడ్డారు కానీ.. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా టీడీపీలో చేరిపోయారు. జిల్లాలో వైసీపీకి ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలు కరవయ్యారు. వరుసగా ఇన్చార్జులను మారుస్తూ.. జగన్ కూడా వారిని గందరగోళ పరిచారు. ప్రభుత్వ పరంగా.. అనంతపురం జిల్లా.. రాయలసీమలో ఎక్కువగా లబ్దిపొందిన జిల్లాగా ఉంది. కరువు జిల్లాలో ఈ ఏడాది అసలు వర్షమే లేనప్పటికీ… వీలైనంత వరకూ.. నీటిని అందించగలిగారు. ఇక పరిశ్రమల రంగంలో.. కియా అతి పెద్ద సంచలనం. కియా రాకతో.. అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అనుబంధ పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ.. టీడీపీకి పాజిటివ్ ఓట్లు తెచ్చి పెట్టడం ఖాయమే.

వైసీపీ బేస్ ఓటు బ్యాంక్ లీడర్లకు చంద్రబాబుపైనే నమ్మకమా..?

2014 ఎన్నికల్లో రాయలసీమలో సరైన విధంగా సీట్లు సాధించడంలో వెనుక బడ్డామని అనుకున్న టీడీపీ.. అధికారం చేపట్టిన నాటి నుండే.. ప్రజల మనసుల్ని గెలుచుకునేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రారంభించారు. పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఫలితంగా.. నాలుగేళ్లకు ముందు.. నాలుగేళ్ల తర్వాత అన్నట్లు సీమ జిల్లాల్లో పరిస్థితిని చూస్తే.. అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో.. జగన్ సెల్ఫ్ గోల్స్‌తో మరింత వెనుకబడిపోయారు. వైసీపీకి మద్దతుగా ఉండే సామాజికవర్గం నేతలు ఇప్పుడు టీడీపీలోనే ఎక్కువగా ఉన్నారు. ఫలితంగా.. ఇప్పుడు రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన అడ్వాంటేజ్ కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధర్మాన చెప్పింది అబద్దమని తేల్చిన జగన్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి.. రెవిన్యూ మంత్రి వేర్వేరుగా స్పందిస్తున్నారు. ఇద్దరూ ఒకటే మాట్లాడితే ఏ సమస్యా ఉండదు. కానీ ఇద్దరూ వేర్వేరుగా ప్రకటిస్తున్నారు. మంత్రి ధర్మాన చట్టం అమలు...

ఫేక్ పోస్టులు , కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం !

సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగాఫేక్ చేసుకుంట ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి చేస్తున్న రాజకీయం తెలంగామణలో కేసులు, అరెస్టుల వరకూ వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను ట్విస్ట్...

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close