ద‌ర్శ‌కుడితో రెజీనా రొమాన్స్

తెలుగులో మ‌ళ్లీ మెల్లిమెల్లిగా అవ‌కాశాల్ని అందిపుచ్చుకొంటోంది రెజీనా. ప్ర‌స్తుతం జో అత్యుతానంత మూవీలో నారా రోహిత్‌తో క‌ల‌సి న‌టిస్తోంది. ఆ చిత్రానికి అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు అదే ద‌ర్శ‌కుడితో వెండితెర‌పై రొమాన్స్ చేయ‌బోతోంది రెజీనా. హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం హంట‌ర్‌. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. న‌వీన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, రెజీనా జంట‌గా న‌టిస్తున్నార్ట‌. సెక్స్ మానియా ఉన్న యువ‌కుడిగా అవ‌స‌రాల శ్రీ‌నివాస్ క‌నిపించ‌నున్నాడు. బాలీవుడ్లో కాస్త ఘాటుగా తీసిన సినిమా ఇది. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా ఆ డోసు కాస్త త‌గ్గిస్తున్నార‌ని తెల‌స్తోంది. మ‌రోవైపు న‌క్ష‌త్రం మూవీలోనూ కీ రోల్ చేస్తోంది. అంటే రెజీనా చేతిలో ఉన్న మూడో సినిమా ఇద‌న్న‌మాట‌. మొత్తానికి రెజీనా ఫామ్ లోకి వ‌చ్చిన‌ట్టే. ఈ సినిమాల్లో ఒక్క‌టి హిట్ట‌యినా మ‌ళ్లీ రెజీనా రేసులోనికి రావ‌డం ఖాయం. అతి త్వ‌ర‌లో హంట‌ర్ మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల్లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కవిత బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు..

లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సోమవారం తీర్పు వెలువరించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ కేసులో తనను ఈడీ, సీబీఐలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, తనకు బెయిల్...

నేడు ఏపీలో ప్రధాని పర్యటన..వైసీపీని టార్గెట్ చేస్తారా.?

సోమవారం ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 : 30 గంటలకు...

ఓటేస్తున్నారా ? : మీ పిల్లలు బానిసలుగా బతకాలనుకుంటున్నారా ?

ఊరంటే ఉపాధి అవకాశాల గని కావాలి. మనం ఊళ్లో బతకాలంటే పనులు ఉండాలి. ఆ పనులు స్థాయిని బట్టి రియల్ ఎస్టేట్ పనుల దగ్గర నుంచి సాఫ్ట్...

తెలంగాణ మోడల్…బీజేపీ, బీఆర్ఎస్ కు రాహుల్ అస్త్రం ఇచ్చారా..?

కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఆరు నెలలే అవుతున్నా అప్పుడే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close